Former CBI Director Alok Verma resigns from service అలోక్ వర్మ వీడ్కోలు.. అస్తానాకు కోర్టులో ఎదురుదెబ్బ..

Attempts being made to destroy cbi alok verma breaks his silence

alok verma, high power commitee, pm modi, corruption, Moin Qureshi, rakesh asthana, delhi high court, nageshwar rao, politics

Hours after the removal from the post of CBI director, Alok Verma broke his silence and said attempts were being made to destroy the country’s premier investigation agency.

ఉద్యోగానికి అలోక్ వర్మ వీడ్కోలు.. అస్తానాకు కోర్టులో ఎదురుదెబ్బ..

Posted: 01/11/2019 07:22 PM IST
Attempts being made to destroy cbi alok verma breaks his silence

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మను పదవి నుంచి మరోమారు తప్పిస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమెడీ అధ్యక్షతతో కూడిన హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం అదేశాలతో డైరెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అలోక్ వర్మ తన పాత టీమ్ ను తిరిగి నియమించుకున్నారు. అయితే అలోక్ వర్మను పదవి నుంచి తప్పించిన క్రమంలో తాత్కాలిక డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగేశ్వర రావు అలోక్ వర్మ పాత టీమ్ బదిలీలను నిలిపేశారు. ఇదిలా వుండగా, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్ కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోవయారు.

 తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు అలోక్ వర్మ రాజీనామా పరిణామాలాకు దారితీసింది. ఇక సీవిసీ కమిటీ విచారణ నుంచి తనను తప్పించాలని ప్రత్యేక సీబిఐ డైరెక్టర్ రాకేష్ అస్తానా పెట్టుకున్న పిటీషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు అతనికి షాక్ ఇచ్చింది. సీవిసీ కమిటీ ముందు తప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles