Arab expat returns lost Dh40,000 cash to UAE Police రోడ్డుపై డబ్బులు మూట కనిపించగానే..

Arab expat returns lost dh40 000 cash to uae police

Abu Dhabi, Police, Arab expat, money, Criminal Security Department, Al Dhafra region, Mahmood Khaled Al Chebli, Asian resident

Abu Dhabi: Police in the Al Dhafra region have honoured an Arab resident for handing over a large amount of cash he found in the middle of the road.

రోడ్డుపై డబ్బులు మూట కనిపించగానే..

Posted: 01/11/2019 11:12 AM IST
Arab expat returns lost dh40 000 cash to uae police

నడిరోడ్డుపై డబ్బుల మూట కనిపించగానే అందులో ఏముందా అన్న సందేహం కొద్ది దానిని తీసుకున్న ఓ యువకుడు.. దానిపై రాసి వున్న చిరునామాకు దానిని చేరవేయకుండా.. ఓ పని చేశాడు. దాంతో ఇప్పుడా యువకుడు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా నిజాయితీ గల వ్యక్తిగా మారడంతో పాటు అతని నిజాయితీకి మెచ్చిన పోలీసులు అతనికి చిన్న బహుమతితో పాటు అతనికి అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని కూడా ఇచ్చి సత్కారించారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడంటే..

చేతిలో లక్షల రూపాయల డబ్బులు వుంటేనే అవి భద్రంగా ఇంటికి తీసుకెళ్లగలమా.? లేదా.? అన్న అనుమానాలు వున్నాయి. అలాంటి ఏకంగా డబ్బు మూటను రోడ్డులో జారవిడుచుకుంటే.. అది తిరిగి మన దరి చేరుతుందన్న ఆశలు తక్కువే. అలాంటిది అబుదాబిలో మాత్రం ఓ అసియా వలసవాది పోగొట్టుకున్న డబ్బు మూటను పోలీసులకు అందించాడీ యువకుడు. అబుదాబికి వలస వెళ్లిన ఓ ఆసియా దేశవాసి ఏకంగా 40 వేల దిర్హమ్లు (రూ.7,67,080)  పొగొట్టుకున్నాడు.

అయితే అటుగా వెళ్తున్న అబుదాబికి చెందిన యువకుడు డబ్బు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించాడు. డబ్బు ప్యాకెట్‌ రూపంలో మూటగట్టి ఉందని అతడు తెలిపాడు. అంతేకాకుండా ఆ మూటపై పేరు ఇతర వివరాలు కూడా ఉన్నాయన్నాడు. డబ్బు తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి అప్పగించానని అతడు చెప్పాడు. ఎవరూ గమనించని ప్రదేశంలో పెద్ద మొత్తంలో డబ్బు దొరికినా కూడా అతడు ఆ డబ్బు తీసుకోకుండా తమకు అప్పగించడం నిజంగా అభినందనీయమని పోలీసులు అధికారులు అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abu Dhabi  Police  Arab expat  money  Criminal Security Department  Asian resident  

Other Articles