railways to run special trains to vijayawada వెంకయ్య చోరవ.. విజయవాడకు ప్రత్యేక రైళ్లు..

Railways to run special trains to vijayawada on venkaiah naidu instructions

South Central Railway, special trains, jansadharan trains, hyderabad-vijayawada, sankranti festival, Vice-President of India, Venkaiah Naidu

South Central Railways to run special jansadharan trains to vijayawada with a total of 18 services from 11th jan to 20th jan in lieu of sankranti festival on Vice-President Venkaiah Naidu instructions.

వెంకయ్య చోరవ.. విజయవాడకు ప్రత్యేక రైళ్లు..

Posted: 01/11/2019 10:29 AM IST
Railways to run special trains to vijayawada on venkaiah naidu instructions

ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను అలకరించడం వల్ల ఆ రాష్ట్రానికి లాభం కూడా ఒనగూరుతుంది. అందుకనే ఉన్నత పదవుల్లో మనవారు అధిక సంఖ్యలో వుండాలని ఆయా రాష్ట్రాలవారు కోరుకోవడం కూడా సముచితమే. అదెలా అంటే.. సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు సొంతూళ్లకు ప్రయాణాలు సాగిస్తారు. ఇందుకోసం ముందుగానే ప్లానింగ్ చేసుకన్న ప్రయాణికులు తమ టికెట్లను రిజర్వు చేసుకుంటారు.

అయితే పండగ సెలవులు ఖచ్చితంగా తెలిసిన తరువాత రైలు టికెట్లను రిజర్వు చేసుకునేందుకు ప్రైవేటు పరిశ్రమల కార్మికులు పోటీ పడతారు. ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి రైలు టికెట్లు లభించగా, అనేక మంది మాత్రం నిరుత్సాహంగా వెనుదిరిగి ఇతర రవాణా సాధనాలను అశ్రయించి.. జేబు గుల్లయినా తప్పదంటూ వెళ్తుంటారు. ఇక చివరి క్షణం వరకు వెళ్లాలా వద్దా.? అంటూ డైలిమాలో వున్నవాళ్లు కూడా వేల సంఖ్యలోనే వున్నారు. అయితే ఇలాంటి వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చోరవతో అదృష్టం కలసివచ్చింది. వెంకయ్యనాయుడు రైల్వేశాఖ అధికారులతో చోరవ తీసుకుని మాట్లాడిన నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ కానుక ఇచ్చింది.

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జన్‌సాధారణ్‌ పేరుతో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 07912 నంబరుతో, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 07193 నంబర్‌ సర్వీస్‌తో ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన మేరకు ఈనెల 11 నుంచి 20 వరకు మొత్తం 18 సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. కాగా వెంకయ్యనాయుడు తన అత్త దశదిన కార్యక్రమం కోసం నెల్లూరులోని వెంకటాచలానికి బుధవారం వెళ్లారు. అక్కడి నుంచి రైలు మార్గంలో రేణిగుంటకు చేరుకున్నారు.
 
ఈ ప్రయాణంలో విజయవాడ డీఆర్‌ఎం ఆర్‌.ధనుంజయులు, పలువురు రైల్వే అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు నడపాలన్న తన సూచనపై స్పందించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. చొరవ తీసుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సంక్రాంతికి ఇంటికి వెళ్లేందుకు ఈ సర్వీసులు ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో స్వర్ణభారత్‌ ట్రస్టు రెండో వార్షికోత్సవాన్ని ఈనెల 13న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles