will bomb all those feeling unsafe in India: BJP MLA మోడీ హయంలో భద్రత కరువైందంటే బాంబులేస్తా: బీజేపి ఎమ్మెల్యే

I will bomb those who feel unsafe in this country up bjp mla vikram saini

​Khatauli MLA Vikram Saini,will bomb those who feel unsafe in India: BJP MLA,Vikram Saini BJP,Vikram Saini,UP BJP MLA ​ Vikram Saini,MLA Vikram Saini,BJP MLA Vikram Saini,Bharatiya Janata Party, politics

Khatauli BJP MLA Vikram Saini on Friday triggered a controversy by threatening those allegedly raking up an atmosphere of insecurity in the country, saying he will "blast them.”

మోడీ హయంలో భద్రత కరువైందంటే బాంబులేస్తా: బీజేపి ఎమ్మెల్యే

Posted: 01/04/2019 05:30 PM IST
I will bomb those who feel unsafe in this country up bjp mla vikram saini

బీజేపి అమలుపరుస్తున్న రాజకీయ స్ట్రాటజీ దేశ ప్రజలను ఆకట్టుకోవడం సంగతి అటుంచితే.. వారిలో కొన్ని వర్గాలను మాత్రం భయాందోళనకు గురిచేసేలా వుందన్న విమర్శలు ఇప్పటికే పలురంగాల ప్రముఖుల నుంచి.. ఇటు రాజకీయా పార్టీల నుంచి కూడా వినిపిస్తుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తమ అధిపత్యం ప్రదర్శించాలని ఓ వైపు బీజేపి అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు బీజేపి నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కూడా అదే బాటలో నడిచారు. భారత్ లో భద్రత కరవయిందని చెప్పేవారిని బాంబులతో లేపేయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు. కానీ కొందరు ద్రోహులు మాత్రం భారత్ లో రక్షణ లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా ఎక్కడ క్షేమంగా ఉంటామని భావిస్తారో, అక్కడికే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

లేదంటే తనకు హోంశాఖ ఇవ్వాలనీ, ఒకవేళ తనకు హోంశాఖ ఇస్తే ఇలా మాట్లాడుతున్న వారందరినీ బాంబులతో లేపేస్తానని హెచ్చరించారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ వందేమాతరం గీతాలాపనను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ లో వందేమాతరం ఆలాపనపై సంప్రదాయాన్ని కాంగ్రెెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. చివరగా ఇదంతా తన వ్యక్తిగత వ్యాఖ్యలనీ, దీనికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా, విక్రమ్ సైనీకి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ తన భార్య ఇద్దరు పిల్లలు చాలు అన్న క్రమంలో జనాభా నియంత్రణకు అనుకూలంగా ఓ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు తాను తన భార్యను పిల్లలను కంటూనే వుండాలని చెప్పానని అన్నారు. ఇక ఆ తరువాత న్యూఇయర్ వేడుకలు హిందువులు జరుపుకోవడంపై కూడా మండిపడ్డ ఆయన.. న్యూఇయర్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటారని అది భారత సంప్రదాయం కాదని అగ్గిరాజేశారు.


విక్రమ్ సైని వ్యాఖ్యలు ఉగ్రవాదిలా వున్నాయని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని చంపండీ అంటూంటే.. మంత్రి పదవిపై కన్నేసిన ఆయన ఎమ్మెల్యే ప్రజలపై బాంబులేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణం యోగీ ప్రభుత్వం సైనీని అరెస్టు చేసి శిక్షించాలని అన్నారు. ఆయన తీవ్రవాదిలా వ్యవహరిస్తున్న క్రమంలో ఆయన వెనుక ఏవైనా ఉగ్రవాదశక్తులు వున్నాయా అన్నకోణంలోనూ విచారణ జరిపించాలని రాజ్ బబ్బర్ డిమాండ్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ​Khatauli MLA  Vikram Saini  bomb  unsafe in India  Vikram Saini BJP  politics  

Other Articles