Farmer earns Rs 490 from 19 Tonnes Potato ఆలూ అమ్మితే ఎకరం గిట్టుబాటు ధర.. కడుపు మండి రైతు..

Potato farmer sends paltry profit of rs 490 from 19 000 kg produce to pm

agra, farmer, 19,000 kg of potatoes, farmer money order to PM Modi, Pradeep Sharma, agra farmer, suicide, uttar pradesh, pm modi, narendra modi, farmer agitation, damaged harvest, yogi, government

There is nothing ‘new’ in this New Year for Indian farmers. Out of sheer desperation, Pradeep Sharma, a farmer of Agra, sent all his earnings, amounting to Rs 490 as a money order to PM Modi, which was earned after selling 19,000 kg of potatoes.

ITEMVIDEOS: ఆలూకు గిట్టుబాటు ధర రాక.. కడుపు మండిన రైతు ఏం చేశాడంటే..

Posted: 01/04/2019 04:51 PM IST
Potato farmer sends paltry profit of rs 490 from 19 000 kg produce to pm

రైతుల కళ్లలో ఆనందం నింపుతామని, వారి ఆదాయన్ని ఏడాదిలోగా రెండింతలు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన బీజేపి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా.. రైతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదనడానికి ఇది మరో సాక్ష్యం. దేశ సర్వన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే రైతుల విషయంలో కేంద్రానికి పలుమార్లు మొట్టికాయలు వేసినా.. నష్టపరిహారం చెల్లించాలని చెప్పినా పెడచెవిన పెట్టిన కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు.

ఇక తమ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాక కడుపు మండిన రైతులు తమ నిరసనను ఏకంగా ప్రధాని మోడీకే రుచిచూపిస్తున్నారు. మొన్నటికి మొన్న నాసిక్‌కు చెందిన ఓ ఉల్లి రైతు 750 కేజీల ఉల్లి అమ్మితే కేవలం వెయ్యి రూపాయలు లాభం వచ్చిందని బాధపడి.. దాన్ని ప్రధాని మోదీకి మనీ ఆర్డర్ చేశాడు. తాజాగా ఆ జాబితాలో మరో రైతు చేరాడు. ఈ సారి ఉల్లి రైతు కాదు. ఆలూ రైతు. యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన ప్రదీప్ శర్మ అనే రైతు కూడా ఇదే విధంగా తన నిరసనను వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం 19,000 కేజీల బంగాళాదుంపలను మార్కెట్లో అమ్మాడు. అందుకుగాను అతడికి రూ.94,677 వచ్చింది. అందులో లోడింగ్, అన్ లోడింగ్ ఖర్చులు, కమీషన్లు, హమాలీల కూలీలు, ఇతర చిల్లర ఖర్చులు కలిపి రూ.48,187 బిల్లు అయింది. ఇంక మిగిలింది రూ.46,490. అందులో ఆలుగడ్డను కోల్డ్ స్టోరేజీలో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచినందుకు అయిన బిల్లు రూ.46,000. అది కూడా తీసేస్తే రైతుకు వచ్చిన లాభం రూ.490.

పది ఎకరాలు సాగు చేసి, కూలీలకు డబ్బులు పెట్టి, శ్రమకోర్చి మార్కెట్‌కు సరుకు తీసుకొస్తే కేవలం రూ.490 లాభం రావడాన్ని చూసిన ఆ రైతు కడుపు తరుక్కుపోయింది. ఆ డబ్బులను ప్రధాని మోదీకి మని ఆర్డర్ చేశాడు. అయితే, ప్రధాని మోదీని నిందించడానికి, అపహాస్యం చేయడానికి తాను మనిఆర్డర్ చేయలేదని, రైతులకు ప్రధాని చేయాల్సింది ఎంతో ఉంది అని చెప్పడానికే తాను ఈ పనిచేసినట్టు ప్రదీప్ శర్మ తెలిపాడు.

ప్రదీప్ శర్మకు ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి కాదు. గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మద్దతు ధర లేక ఆలూ రైతులు పడుతున్న బాధల మీద గతంలో కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీకి ప్రదీప్ శర్మ పలుమార్లు లేఖలు రాశాడు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మను కూడా కలిశాడు. అయితే, అంతా వృధా ప్రయాసే అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agra  farmer  19  000 kg of potatoes  suicide  pm modi  uttar pradesh  politics  

Other Articles