YS Jagan attempt murder case to be investigated by NIA జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు.!

Ys jagan attempt murder case to be investigated by nia

YS Jagan, NIA, national investigative agency, union home ministry, cisf conistable, re-investigation, YS Jagan attacked, Srinivas Rao, criminal record, AP police, city neuro hospital, YS Jagan vizag airport attack, YS Jagan Mohan Reddy, YS Jagan, central investigative agencies, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

Andhra pradesh High Court handovers YS Jagan attempt murder case to NIA, union home ministry give directions to the agency to start the case investigation from the CISF officials statement who were in duty on the day.

జగన్ పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు.!

Posted: 01/04/2019 02:43 PM IST
Ys jagan attempt murder case to be investigated by nia

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నట్టుగా కేసు విచారణను జాతీయ సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో శ్రీనివాసరావు మాత్రమే నిందితుడని, వెనుక మరెవరూ లేరని ఏపీ పోలీసు అధికారి లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున, విచారణను జాతీయ సంస్థకు అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.

కాగా, ఈ కేసును విమానయాన చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసి, సెక్షన్ 3 (ఏ) కింద నమోదు చేయాలన్న వైసీపీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన స్పందించి కేంద్ర హోంశాఖ విమానాశ్రయంలోని ఘటన జరిగిన సమయంలో వున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల పిర్యాదును నమోదు చేసుకుని కేసును విచారించాలని అదేశించింది. ఏపీ హైకోర్టు అదేశాలతో జగన్ పై హత్యకేసును స్వీకరించిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది.

ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ.. అదనపు ఎస్పీ సాజిద్ ఖాన్ ను విచారణ అధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో గతేడాది అక్టోబర్ 25న శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణలో సైతం జగన్ మెడపై దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడనీ, దాడి సరిగ్గా జరిగి ఉంటే జగన్ చనిపోయేవారని తేలింది. కత్తి భుజంపై గుచ్చుకోవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జగన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఇక మరోవైపు జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగిసింది. ఈ కేసులో ఏకైక నిందితుడు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అతడిని జైలులోనే ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. అయితే కేసు ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో శ్రీనివాసరావు రిమాండ్ కూడా ముగియడంతో అతని జుడీష్యల్ కస్టడీని పెంచుతారా.? లేక ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తారా? అన్న విషయంలో క్లారిటీ రాలేదు. కాగా, ఏపీలో విజయవాడలోనే ఎన్ఐఏ కోర్టు ఉండటంతో ఈ కేసు విశాఖ నుంచి విజయవాడ పట్టణానికి బదిలీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles