ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి ఈజిప్ట్‌లోని పిరమిడ్స్. చరిత్రలో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ప్రపంచ నలుమూలల నుంచి అనునిత్యం వేల సంఖ్యలో పర్యాటకులను అకర్షిస్తుంది. ఇలానే వెళ్లిన ఓ డెన్మార్క్‌కు చెందిన జంట.. తమకు ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంది. అయితే ఇలా చేసి చారిత్రక పిరామిడ్స్ ప్రతిష్టను దిగజార్చుతారని మాత్రం ఏవరూ ఊహించరు. తమ పరును కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ఈజిప్టు పోలీసులు ఇప్పుడీ జంట కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
ఇంతకీ వాళ్లు చేసిన పనేంటి..? వాళ్ల కోసం పోలీసులు ఎందుకు అన్వేషణ సాగిస్తున్నారు. అంటే.. గ్రేట్ పిరామిడ్ అఫ్ గిజాపైకి వెళ్లిన ఈ జంట ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకుని.. అందరికీ భిన్నంగా ఆలోచించింది. పిరమిడ్స్ దగ్గర బట్టలన్నీ విప్పేసి న్యూడ్ ఫోటోలు దిగారు. అంతేకాదు అక్కడే వారు శృంగారంలో మునిగితేలుతూ ఫోర్న్ వీడియోలను కూడా చిత్రీకరించుకున్నారు. వాటిని తాము మాత్రమే చూసుకుంటే గుర్తింపు ఎలా వస్తుందని అనుకున్నారో ఏమో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే... అవి కాస్త వైరల్ కావడంతో చిక్కుల్లో ఇరుక్కుంది.
నిజానికి పిరమిడ్స్‌ను చూసేందుకు మాత్రమే పర్యాటకులను అనుమతి ఇస్తారు. వాటిని ఎక్కడం నిషేధం. అయితే ఆండ్రియా హావిద్, అతని ప్రియురాలు మాత్రం నిబంధనలకు విరుధంగా పిరమిడ్‌ను ఎక్కారు. రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ జిజాను ఎక్కిన హావిద్, అతని ప్రియురాలు... పైకి వెళ్లిన తర్వాత బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఫోటోలు దిగారు. ఫోటోషూట్ పూర్తయిన తర్వాత శృంగారం చేసుకుంటూ సెక్స్ వీడియో కూడా షూట్ చేశారు. మూడు నిమిషాల పాటు రికార్డు చేసిన ఈ సెక్స్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
టైటిల్ లోనే ఈజిప్ట పిరమిడ్స్పైన శృంగారం చేశామంటూ పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దాంతో డానిష్ జంటపై ఈజిప్ట్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది. ఈజిప్ట్ పురావస్తుశాఖ మంత్రి ఖలీద్ అల్- అనానీ ఈ ఘటనపై అటార్నీ జనరల్ దర్యాప్తుకు ఆదేశించారు. స్వతాహాగా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన హావిద్... ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాడు. ఇంతకుముందు కూడా చాలా చోట్ల న్యూడ్ ఫోటోలు తీసినట్టు అతని సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తేలింది. అయితే ఈజిప్ట్ పిరమిడ్స్‌పై మనోడు చేసిన బూతు పని మాత్రం అతన్ని చిక్కల్లో పడేసింది. హావిద్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈజిప్ట్ ప్రభుత్వం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more