Uttam kumar suspects changes and tampering of EVMs ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పు జరగోచ్చు: ఉత్తమ్ అనుమానం

Uttam kumar suspects changes and tampering of evms

Uttam Kumar Reddy, Telangana Congress, Mahakutami, EVMs, Election Commision, TRS, Telangana Politics

Telangana pradesh congress chief Uttam Kumar Reddy suspects change of EVM or tampering of the same, alleges Elections commission is in full favour of ruling party.

ఈసీ విఫలం.. ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పు జరగోచ్చు: ఉత్తమ్ అనుమానం

Posted: 12/08/2018 05:02 PM IST
Uttam kumar suspects changes and tampering of evms

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక విషయాల్లో విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో దొర్లిన పొరపాట్లపై సాక్షాత్తూ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమారే క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. ప్రజాకూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తంచేశారు. ఇవాళ ఆయన గోల్కొండ హోటల్‌లో కూటమి భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఓట్ల లెక్కింపు సందర్భంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఉత్తమ్ కోరారు. స్ట్రాంగ్‌ రూమ్ ల భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌ రూములను ఒకసారి లాక్‌ చేసిన తర్వాత అధికారులు ఎవరూ వెళ్లకూడదని, కొందరు లోపలకు వెళ్తున్నారనే సమాచారం తమకు అందిందన్నారు. అందువల్ల ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడ ఉండేవిధంగా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈవీఎంల తరలింపు, భద్రత విషయంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అవకతవకలు జరుగుతాయోమోనని తమ పార్టీ నేతల్లో పలువురికి అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా తమకు ఉన్నాయని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్ లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఓటరు లిస్టులను సరి చేయకుండా ఎవరి కోసం ఇంత తొందరగా ఎన్నికలు నిర్వహించాల్చి వచ్చిందని ఉత్తమ్ ప్రశ్నించారు. వేలాది మంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు. పోలింగ్ బూత్‌ ఏజెంటే కౌంటింగ్‌ ఏజెంట్‌గా ఉంటే బాగుంటుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి అనుకూలమైన కొన్ని న్యూస్ ఛానళ్లు టీఆర్‌ఎస్ అనుకూలంగా చెప్పాయని ఉత్తమ్ ఆరోపించారు. 100కు పైగా స్థానాలు వస్తాయన్న కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు 80 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారని, ఓట్ల లెక్కింపు తర్వాత వారికి 35కి మించి రావని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఎన్నికల పోలింగ్‌లో భాగస్వాములైన, సహకరించిన కార్యకర్తలు, ప్రజలకు ఉత్తమ్ ధన్యవాదాలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttam Kumar Reddy  Telangana Congress  Mahakutami  EVMs  Election Commision  TRS  Telangana Politics  

Other Articles