Live-in relationship goes wrong in pune సీన్ రివర్స్: పెళ్లికి నిరాకరించిందని ఊరంతా పోస్టర్లు..

Live in relationship goes wrong lover takes revenge by disributing posters

Live-in relationship goes wrong, Live-in relationship, scene reverse, woman rejects marriage, lover, revenge, posters, Pune, Pune Police, parents compalint, defame, crime

Live-in relationship goes wrong, As the girl rejects the marriage with him. He wanted to take revenge, he pasted poster in the area requesting to marry him with disclosing all her details. police are in search of him

సీన్ రివర్స్: పెళ్లికి నిరాకరించిందని ఊరంతా పోస్టర్లు..

Posted: 12/06/2018 02:44 PM IST
Live in relationship goes wrong lover takes revenge by disributing posters

సీన్ రివర్స్ అయ్యింది. తనతో సహజీవనం చేసిన వ్యక్తి వివాహానికి నిరాకరిస్తున్నాడని పోలీసులను అశ్రయించే బాధితులను, లేదా విపరీత చర్యలకు పాల్పడిన వారి గురించి చూశాం. కానీ ఇక్కడ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగిన ఘటన విస్మయాన్ని కలిగిస్తుంది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడం లేదని అమెపై అగ్రహంతో చేశాడో లేక అవేదనతో చేశాడో కానీ.. ప్రియుడు చేసిన పనికి యువతి తల్లిదండ్రులు లబోదిబోమంటుండగా, పోలీసులు అతని కోసం అన్వేషిస్తున్నారు.

తన ప్రియురాలు గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తుందని.. అయితే తనతో పెళ్లికి మాత్రం అంగీకరించడం లేదని అవేదన చెందిన ప్రియుడు అమెను విడిచి తాను వుండలేనని పేర్కోన్నాడు. తనతో పెళ్లికి ఆమె ఒప్పుకోవాలని కోరుతూ అమె వివరాలను వెళ్లడిస్తూ.. ఊరంతా పోస్టర్లు అంటించేశాడు. ఈ ఘటన  మహారాష్ట్రలోని పూణెలో రిగింది. ఆ పోస్టర్ లలో తన వివరాలతో పాటు యువతి వివరాలను కూడా బహిర్గతపర్చాడు. అంతేకాదు తాము సహజీవనం చేస్తున్నామని కూడా పేర్కోన్నాడు.

యువతి తనను పెళ్లి చేసుకోవాలని కూడా కోరాడు. కానీ అమె మాత్రం మరింత డబ్బున్న వ్యక్తిని కోరుకుంటుందని, తనను వదిలి మరొకరిని వివాహం చేసుకోవాలని భావిస్తోందని రాసుకొచ్చాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాలని కోరాడు. నగర వ్యాప్తంగా ఈ పోస్టర్లు కనిపించడంతో, విషయం పోలీసులకు తెలిసింది. పోస్టర్ల తొలగింపు ప్రక్రియను చేపట్టిన పోలీసులు, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక తమ బిడ్డ వివరాలు వెల్లడించడంతో ఆమె కుటుంబీకులు పరువు పోయిందని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh