పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ అదే పేరు చెప్పి.. రాజధాని నగరానికి చెందిన ఓ యువతిని మోసగించాడు ఓ ఘనుడు. దేశంకాని దేశంలో కూడా తన మోసపూరిత బుద్దని ప్రదర్శించి.. పెళ్లిపై కలలు కంటున్న యువతులను మోసగిస్తున్నాడు నైజీరియన్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నగర మహిళ ఒకరు తన వివాహం నిమిత్తం 'షాదీ.కామ్'లో తన పేరు నమోదు చేయించుకుంది. ఆపై కొన్ని రోజులకు ఆమె సెల్ ఫోన్ నంబర్ కు వాట్స్ యాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. తన పేరు ఆయుష్ త్యాగి అని, గ్రేటర్ నోయిడాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నానని చెప్పాడు.
తాను హైదరాబాద్ కు చెందిన వాడినేనని, అక్కడ స్థిరపడి క్లినిక్ పెట్టుకోవడం తన ఉద్దేశమని, ఇష్టపడితే వివాహం చేసుకుందామని చెప్పాడు. దీనికి సదరు యువతి అంగీకరించింది. తాను ఆగస్టు 8న వస్తున్నానని త్యాగి చెప్పాడు. అదే రోజు ఆమెకు 82911 97915 నంబర్ నుంచి ఫోన్ చేసి పూజ అనే మహిళ మాట్లాడింది. తాను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, త్యాగి అనే వ్యక్తి రూ. 3 కోట్లతో దొరికిపోయాడని, మనీ లాండరింగ్ చట్టం కింద పట్టుబడ్డాడని చెప్పింది. కస్టమ్స్ క్లియరెన్స్ కావాలంటే రూ. 5.45 లక్షలు చెల్లించాలని నమ్మబలికాడు.
అతడి మాటలు నమ్మిన బాధితురాలు, పూజ చెప్పిన బ్యాంకు ఎకౌంట్ కు ఆ డబ్బు పంపింది. ఆపై ఎంత ట్రై చేసినా త్యాగి, పూజ ఫోన్లు కలవక పోవడంతో తనను మోసం చేశారని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. ఆపై కేసును విచారించిన సైబర్ క్రైమ్ విభాగం బాధితురాలికి త్యాగిగా పరిచయమైన వ్యక్తి అసలు పేరు అబేద్ ఒడారా (30) అని, అతనో నైజీరియన్ అని, తన మిత్రుడు, భార్యతో కలసి ఢిల్లీలో ఉంటూ, మ్యాట్రిమోనీ వెబ్ సైట్లపై కన్నేసి మహిళలను మోసం చేస్తుంటాడని పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అతన్నుంచి ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, వైఫై రూటర్లు, ట్యాబ్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్... Read more
Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more
Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more
Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more
Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more