Three days after Amritsar attack, Delhi on High alert హైఅలర్ట్: ఢిల్లీలో చోరబడ్డ ఉగ్రవాదులు..

Delhi on alert as cops release photos of 2 terrorists suspected to be in city

Indian capital, Delhi, Delhi Police, Delhi High Alert, Terrorists, Jaish-e-Mohammad, High Alert in Delhi, Delhi Police advisory, JeM, IB, Intelligence Bureau, JeM terrorists, Punjab bomb blast, Nirankari Bhawan blast, crime

The Delhi Police released the photos of the two men and said that guest houses, hotels and paying guest accommodations where foreign students usually stay, are being scanned to trace the two.

హైఅలర్ట్: ఢిల్లీలో చోరబడ్డ ఉగ్రవాదులు.. ఫోటోలు విడుదల..

Posted: 11/21/2018 12:24 PM IST
Delhi on alert as cops release photos of 2 terrorists suspected to be in city

దేశ రాజధాని ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం అందజేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు ఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని హెచ్చరిస్తూ వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, తక్షణమే 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు.

కాగా, పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్‌పూర్‌కు 9 కిలోమీటర్ల దూరంలో ఓ మైలురాయి వద్ద నలుపు, కాఫీ రంగు కుర్తాలు ధరించిన ఇద్దరు యువకులు ఉన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పట్టణం భారత్, పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. పంజాబ్‌లో ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల అనంతరం ఐబీ హెచ్చరికలు చేయడంతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

జైషే మహమ్మద్‌కు చెందిన ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదుల బృందం పంజాబ్‌లోకి ప్రవేశించారని, ఇక్కడి నుంచి వారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆ రాష్ట్ర పోలీస్ నిఘా విభాగం తెలిపింది. దీంతో పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌ నగర శివార్లలోని సంత్‌ నిరంకారి భవన్‌పై ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల వ్యవధిలోనే ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఢఇల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢి్ల్లీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian capital  Terrorists  Jaish-e-Mohammad  Delhi  delhi police  JeM  IB  Intelligence Bureau  crime  

Other Articles