Supreme declines urgent hearing on Ayodhya ‘ఆయోధ్య’ అభ్యర్థనను మళ్లీ తోసిపుచ్చిన సుప్రీం

Ayodhya title suit sc rejects hindu mahasabha plea for early hearing

Ayodhya case early hearing, Ayodhya title suit, Ram Janmabhoomi issue, Ram temple Ayodhya, Supreme court, Ranjan Gogoi, Ram Mandir, Babri Masjid, Ayodhya land dispute, Akhil Bharatiya Hindu Mahasabha

The Supreme Court declined early hearing of petitions in the Ram Janmabhoomi-Babri Masjid title dispute case. A bench comprising Chief Justice Ranjan Gogoi and Justice S K Kaul said it had already listed the appeals before the appropriate bench in January.

‘ఆయోధ్య’ అభ్యర్థనను మళ్లీ తోసిపుచ్చిన సుప్రీం

Posted: 11/12/2018 01:24 PM IST
Ayodhya title suit sc rejects hindu mahasabha plea for early hearing

అయోధ్య రామజన్మభూమి వివాదం గురించి త్వరగా విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి తోసిపుచ్చింది. దీనికి సంబంధించి వచ్చే జనవరి మొదటి వారంలో ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపడుతుందని గతంలో తెలిపామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిక్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని, వచ్చే జనవరిలో విచారణకు వస్తుందని స్పష్టం చేసింది.

అయోధ్య వివాదంపై త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ తరఫున న్యాయవాది బరూన్ కుమార్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌లు తమ వాదనలు వినిపిస్తూ..దీర్ఘకాలంగా కొనసాగుతోన్న ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించడానికి త్వరగా విచారణ చేపట్టాలని కోరారు.

అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబరు చివరి వారంలో విచారించిన త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీచేయడానికి నిరాకరించింది. మసీదు ఇస్లాంలో భాగం కాదన్న 1994 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఇది కేవలం భూ వివాదం మాత్రమేనని స్పష్టం చేసింది.

వివాదం పూర్వాపరాలు అధారంగా దీనిని సివిల్ కేసుగా పరిగణిస్తున్నట్టు నాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఇది గత తీర్పునకు సంబంధించిన అంశం కాదని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మొత్తం 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిలో నాలుగు భూవివాదం కేసులుగా నమోదయ్యాయి. మొత్తం 2.77 ఎకరాల భూమిని మూడు సమాన భాగాలుగా చేసి, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిరోమోహీ అఖరా, రామ్ లల్లాలకు పంచిపెట్టాలని అలహాబాద్ హైకోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles