Fuel prices slashed for 5th straight day తగ్గిన ఇంధన ధరలు..

Petrol and diesel prices dip further for 5th straight day

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices continued to dip on Monday. Petrol and diesel prices in Delhi were Rs 77.56 per litre and Rs 72.31 per litre; a fall of Rs 0.17 and Rs 0.15 respectively.

వరుసగా ఐదో రోజు తగ్గిన ఇంధన ధరలు..

Posted: 11/12/2018 12:31 PM IST
Petrol and diesel prices dip further for 5th straight day

గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్న పెట్రో ధరలు ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. వరుసగా గత ఐదు రోజులుగా తగ్గతూ వస్తున్న ఇంధన ధరలు ఇవాళ అత్యల్పంగా తగ్గాయి. తాజా తగ్గింపు ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ లీటరు పెట్రోలు ధర 77.56కు చేరగా, లీటరు డీజిల్ ధర 72.31కి చేరింది. దీంతో తాజాగా సోమవారం రోజున లీటరు పెట్రోలుపై 17 పైసలు తగ్గగా, డీజిల్‌పై లీటరుకు 15 పైసలు తగ్గంది.

ఇక తాజ తగ్గింపు నేపథ్యంలో దేశ అర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 82కు చేరుకుంది. ముంబైలో లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్‌పై 16 పైసలు తగ్గింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ. 83.07, డీజిల్ ధర రూ.75.76కు చేరుకుంది. ఇక కొల్ కతలో లీటరు పెట్రోల్ ధర 79.49గా వుండగా, లీజరు డీజిల్ ధర 74.17గా నమోదయ్యింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 80.56గా వుండగా, లీటరు డీజిల్ ధర మాత్రం  76.43గా వుంది. హైదరాబాదులో లీటరు పెట్రోల్ ధర 82.24గా వుండగా, లీటరు డీజిల్ ధర 78.67గా వుంది. ఇక హైదరాబాదులో ఎల్పీజీ సిలిండర్ ధర 999.00కు చేరింది.

ఇటీవల దేశంలో ఎన్నడూ లేనంతగా పెట్రోలు ధరలు పెరుగుతూ పోవడంతో వాహనదారుల జేబులు చిల్లులు పడ్డాయి. పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 4న ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా 84కు చేరగా, లీటరు డీజిల్ ధర 75.45కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ముందేలో 91.34కు చేరుకున్న పెట్రోల్ ధర వాహనదారులను బెంబేలెత్తించింది. దీంతో వాహనదారుల అవస్థలపై స్పందించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల్లో కొంత వాటాను తగ్గించడంతో కొంత ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles