Aadhaar Link For PO, Banks To Stay బ్యాంకులు, పోస్టాఫీసుల్లో.. అధార్ సేవలకు బ్రేక్

Aadhaar enrolment update services by banks post offices to stay uidai

biometrics, ajay bhushan, permanent account number, uidai, income tax, Banks, Post Offices, supreme court, UIDAI

The UIDAI has said that the Supreme Court order restricting use of Aadhaar will have no bearing on enrolment and update services being carried out at banks, post offices and government premises.

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో.. అధార్ సేవలకు బ్రేక్

Posted: 10/09/2018 06:11 PM IST
Aadhaar enrolment update services by banks post offices to stay uidai

దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ సేవలను నిలిపివేయాలని యుఐడిఎఐ నిర్ణయించింది. విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ఇచ్చే ఆధార్ సంస్థ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్‌ నెంబరును బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసంధానం కొనసాగిస్తే అందుకు ఆధార్‌ బాధ్యత లేదని స్పష్టం చేసింది.

ఇప్పటికీ కొందరు సేవల కల్పన సంస్థలు ఎలాంటి ధృవీకరణ లేకుండా యునిక్‌ ఐడిని వినియోగించి ఆఫ్ లైన్‌ పరిశీలన చేయవచ్చునని కూడా న్యాయస్థానం సందేహాలను వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఆధార్‌ బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకులు, పోస్టాఫీసులకు అమలుచేస్తున్న నిబంధనలను అనుసరించి ఆధార్‌ నమోదు‌, మార్పులు, చేర్పులు సేవలను ఇకపై నిలిపివే యాలని సూచించింది.

చిరునామా ధృవీకరణ, వ్యక్తి ధృవీకరణకు ఇవి భిన్నంగా ఉంటాయని వెల్లడించింది. యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్‌ పాండే మాట్లాడుతూ ఆఫ్ లైన్ మోడ్ లో ఆధార్ ను వినియోగిస్తున్నారని, పాన్‌, ఐటిఆర్‌, నేరుగా లబ్ది బదిలీ వంటి ప్రభుత్వ పథకాలకు ఆధార్ ను ప్రభుత్వమే రాజ్యాంగబద్ధం చేసిందని, ఆధార్‌ మొత్తం ప్రక్రియలో బ్యాంకులు కీలకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అందువల్ల తీర్పునకు ముందే బ్యాంకులు, పోస్టాఫీసులు ఆధార్‌ లింకింగ్‌ చేపట్టినందున తాజా నిబంధనలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుందని పాండే వెల్లడించారు. ధృవీకరణ సేవలకు, ఆధార్‌ అప్‌డేట్‌, ఎన్‌రోల్స్‌మెంట్‌కు తేడా ఉందని పేర్కొన్నారు. యుఐడిఎఐ ఆధార్‌కేంద్రాలను పునర్‌వ్యవస్థీకరిస్తోందని, అందువల్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌ధృవీకరణను వినియోగిం చకూడదని ఆయన సూచించారు.

బ్యాంకులు పోస్టాఫీసులు సైతం దేశవ్యాప్తంగా 13వేల కేంద్రాలకుపైగా వీటిని ఏర్పాటుచేసారు. మరికొన్ని కేంద్రాలను ఆధార్‌ప్రారంబిస్తుందని అన్నారు. ఇప్పటికిప్పుడు మాత్రం బ్యాంకులు కొనసాగించే ఎన్‌రోల్‌మెంట్‌, అప్‌డేషన్‌ కార్యకలాపాలకు తమనిబంధనల్లో ఎలాంటి మార్పులులేవని ఆయనఅన్నారు. ఇ-ఆధా ర్‌, క్యూఆర్‌ అంటే క్విక్‌రెస్పాన్స్‌ కోడ్‌ ఆధారంగా ఎలాంటి దృవీకరణలేకుండా ఆధార్‌ను వినియోగిస్తున్నారని, బయోమెట్రిక్స్‌ లేదా 12 అంకెల నంబరును వినియోగిస్తున్నారని వెల్లడించారు.

కేవలం నమోదు, మార్పులకు మాత్రమే వినియోగిస్తన్నారని పాండే వెల్లడించారు. ఇటీవలి తన తీర్పులో రాజ్యాంగ బద్ధతను గుర్తిస్తూనే ఆధార్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు ప్రాజెక్టును బ్యాంకులు, మొబైల్‌ కనెక్షన్లు, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్బంధం చేయడం వీలుకాదని వెల్లడించింది. అయితే ఆధార్ ను సంక్షేమ పథకాలకు వినియోగించవచ్చని, ఎలాంటి గోప్యత ఉల్లంఘన లేదని ఐదుగురు సభ్యుల అతున్నత్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. పాన్‌, ఐటిఆర్‌ లలోను ఆధార్‌ ను విధిగా వేయాల్సిందేనని, చెపుతూనే కోర్టు ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను రద్దు చేస్తూ.. ప్రైవేటు సంస్థలు అధార్ డేటాను వినియోగించరాదని పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : biometrics  ajay bhushan  permanent account number  uidai  income tax  Banks  Post Offices  supreme court  UIDAI  

Other Articles