Court frees nakkeeran gopal, refuses remand తమిళనాడు గవర్నర్ కు షాక్.. నకీరన్ గోపాల్ విడుదల..

Blow to tamil nadu governor court refuses to remand arrest of nakkeeran gopal

Tamil Nadu, Governor, Chennai Police, Magistrate, Nakkeeran Gopal, Marumalarchi Dravida Munnetra Kazhagam (MDMK), Madras High court, Nirmala devi, Madurai Kamaraj University, professor, sexual favours, sex scandal, Governor Banwarilal Purohit, politics

In a major embarrassment for Tamil Nadu Governor and Chennai police, the Magistrate has refused to remand journalist Nakkeeran Gopal to judicial custody.

తమిళనాడు గవర్నర్ కు షాక్.. నకీరన్ గోపాల్ విడుదల..

Posted: 10/09/2018 07:03 PM IST
Blow to tamil nadu governor court refuses to remand arrest of nakkeeran gopal

తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ తో పాటు తమిళనాడు పోలీసులకు మద్రాస్ హైకోర్టు జలక్ ఇచ్చింది. నక్కీరన్ ఎడిటర్ గోపాల్ ను ఏ నేరం కింద రిమాండ్ విధించాలంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆయన అరెస్ట్ సరికాదంటూ తేల్చిచెప్పింది. నక్కీరన్ గోపాల్ పై రాజద్రోహం కేసు పెట్టడాన్ని కోర్టు తప్పుబట్టింది. నక్కీరన్ గోపాల్ కు రిమాండ్ విధించడానికి మద్రాస్ హైకోర్టు వ్యతిరేకించింది. ఓ లైంగిక కేసు ఆరోపణల నేపథ్యంలో గవర్నర్‌ పై అసత్య ఆరోపణలు చేస్తూ తన సొంతపత్రికలో తప్పుడు వార్తలు రాశారని అభియోగాలు నమోదయ్యాయి.

రాజభవన్  గౌరవానికి భంగం వాటిల్లే విధంగా అమర్యాదకరంగా కథనాన్ని ప్రచురించారని ఆరోపిస్తూ రాజభవన్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు ఓ కార్యక్రమానికి హాజరైయ్యేందుకు ఫూణేకు బయలుదేరేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న నక్కీరన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాల్‌ అరెస్ట్‌ పై తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్‌ ఖండించారు. బీజేపీ, అధికార ఏఐడీఎమ్‌కే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తున్నాయని ఆరోపించారు.

కాగా, గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌పై తప్పుడు కథనం రాసారని నక్కీరన్ గోపాల్ ను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. తమిళ వీక్లీ ‘నక్కీరన్‌’కు ఆయన ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మార్కులు కావాలంటే ఉన్నతాధికారుల కోరికలు తీర్చాలంటూ విద్యార్థులకు గాలం వేసి మరీ వ్యభిచారంలోకి దించుతుందన్న అభియోగాలపై అరెస్టు అయిన మధురై కామరాజ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ నిర్మాలా దేవీ.. గవర్నర్‌ వద్దకు కూడా విద్యార్థులను తీసుకెళ్లిందని నక్కీరన్‌ తన కథనంలో పేర్కొన్నారు.

దీంతో నక్కీరన్ పై రాజ్ భవన్‌ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ‘గవర్నర్‌ పురోహిత్‌ను కలిసినట్లు ప్రొఫెసర్‌ నిర్మలాదేవీ పోలీసుల విచారణలో అంగీకరించారు. గవర్నర్‌ చీఫ్‌ సెక్రటీరిని కొంత మంది విద్యార్థినులు కలిశారు. అందుకే గవర్నర్‌ ఈ కేసుపై విచారణ చేసేందుకు అంగీకరించడం లేదు అంటూ నక్కీరన్‌ తన కథనంలో రాసుకొచ్చారు. గవర్నర్ పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం వాటిల్లే విధంగా కథనాన్ని ప్రచురించారని ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన పత్రికలో ప్రచురించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Banwarilal Purohit  Nakkeeran Gopal  madras high court  Tamil Nadu  

Other Articles