Still diabetic even after following veeramachaneni diet వీరమాచనేని డైట్ తో షుగర్ తగ్గలేదు: వరప్రసాద్ రెడ్డి

Still diabetic even after following veeramachaneni diet varaprasad reddy

Shantha biotechm varaprasad reddy, senstaional comments, veeramachaneni ramakrishna, diet, diabetic, sugar levels, veeramachaneni diet

Shantha biotech founder varaprasad senstaional comments on veeramachaneni ramakrishna diet says his diabetic condition has not come down to control but his wife got her sugar levels controlled after following veeramachaneni diet

వీరమాచనేని డైట్ తో షుగర్ తగ్గలేదు: శాంతా బయోటెక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి

Posted: 08/28/2018 04:18 PM IST
Still diabetic even after following veeramachaneni diet varaprasad reddy

షుగర్, ఉబకాయం, బిపీ సహా పలు రుగ్మతలను నియంత్రించుకోవడానికి తన సలహాలు, సూచనలు పాటిస్తే చాలునని వీరమాచనేని రామకృష్ణ తనదైన శైలిలో డైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరమాచనేని డైట్ పై ఓ వైపు వైద్యులు ప్రజలను హెచ్చరిస్తూ.. ఆయన డైట్ పాటించడం వల్ల మొదటికే ప్రమాదం రావచ్చునని కూడా హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మరో అడుగుముందుకేసిన వీరమాచనేని తన డైట్ పాటించడం వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఘంటాపథంగా చెబుతున్నారు. చాలా మంది మేము ఇన్ని కేజీల బరువు తగ్గామని కూడా చెబుతున్నారు.

90 నుంచి 120 రోజుల పాటు ఈ ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ ను పూర్తిగా అరికట్టవచ్చని అంటున్నారు. శాంతా బయోటెక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ డైట్ తో ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని వీరమాచనేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఈ విషయమై వరప్రసాద్ ఓ పత్రికకు లేఖ రాశారు. తాను, తన భార్య 80 రోజుల పాటు వీరమాచనేని ఆహార నియమాలను పాటించినట్లు వరప్రసాద్ తెలిపారు. ఈ డైట్ కారణంగా తన భార్యకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆహార నియమాలు తనపై పెద్దగా ప్రభావం చూపలేకపోయానని పేర్కొన్నారు. తన స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నట్లు తెలియడంతోనే ఈ లేఖ రాస్తున్నానని అన్నారు.

వీరమాచనేని డైట్ లో చెప్పిన విధంగా తామిద్దరం వరి బియ్యం, పప్పులు, పండ్లు, దుంపలు, చక్కెర, బెల్లం భోజనంలో లేకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు. రోజుకు ఆహారంలో 70 గ్రాముల కొబ్బరినూనెతో పాటు, ఆవు నెయ్యి, 2-3 కోడిగుడ్లు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇన్సులిన్ మాత్రలు, ఇంజెక్షన్లను వాడలేదన్నారు. ఇలా 80 రోజులు పాటించినా ఈ డైట్ తన షుగర్ వ్యాధిపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ, తన భార్య షుగర్ మాత్రం నియంత్రణలోకి వచ్చిందని వెల్లడించారు. డైట్ పాటించిన కాలంలో తన షుగర్ నిల్వలు 180, 190కి తగ్గలేదని వరప్రసాద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles