Pune police arrested Varavara Rao in hyderabad వరవరరావు, సుధా భరద్వాజ్ ల అరెస్టు

Poet varavara rao arrested in case relating to conspiracy to assassinate pm modi

Arun Ferreira", "Delhi", "Telangana", "Mahesh Raut", "official", "police official", "Sudhir Dhawale", "Mumbai", "Vishrambaug Police Station", "Chhattisgarh", "Vernon Gonzalves", "Gautam Navalakha", "Surendra Gadling", "Goa", "Varavara Rao", "Nagpur Wilson", "Maharashtra", "senior police official", "States and union territories of India", "Pune police", "lawyer", "Rona Wilson", "Koregaon", "Naxalite–Maoist insurgency", "Dalit protests in Maharashtra", "Hyderabad", "Shoma Sen", "India", "Haryana", "Sudha Bhardwaj", "Geography of Maharashtra", "activist and poet", "Pune", "Faridabad", "joint commissioner", "Koregaon Bhima

Hyderabad-based revolutionary writer Varavara Rao was arrested by Pune police in Hyderabad on Tuesday, following raids on his flat in the city in a case relating to alleged conspiracy to assassinate Prime Minister Modi, along with Faridabad Union activist Sudha Bhardwaj

ప్రధాని హత్యకు కుట్ర: వరవరరావు, సుధా భరద్వాజ్ ల అరెస్టు

Posted: 08/28/2018 05:01 PM IST
Poet varavara rao arrested in case relating to conspiracy to assassinate pm modi

ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రలో వరవరరావు పాత్ర వుందన్న పోలీసులకు లభ్యమైన ఓ లేఖలో వెల్లడి పేర్కొనివుండటంతో ఆయన నివాసంలో ఇవాళ ఉదయం నుంచి సోదాలు నిర్వహించిన మహారాష్ట్ర, చత్తీస్ గడ్ పోలీసులు సోదాలను నిర్వహించారు.

ఈ ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు వెల్లడైందని పోలీసుల తెలిపారు. మహారాష్ట్రలోని మావో సానుభూతిపరుడు రొనాల్డ్ విల్సన్ వద్ద లభ్యమైన లేఖలో వరవరరావు పేరు ఉండటంతో అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు. గత మూడు నెలల పాటు ఈ లేఖల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు.. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని వరవరరావు, ఆయన కుమార్తె ఇంటితో పాటు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకులతో పాటు మరో ఇద్దరి ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఆయన నివాసంలో ఉన్న ప్రతి పేపర్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, విచారణ, సోదాలను పూర్తి స్థాయిలో వీడియో తీశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి నేరుగా పూణెకు తరలించనున్నారు. వరవరరావును అదుపులోకి తీసుకుంటున్నట్టు కాసేపటి క్రితమే ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు తెలిపారు. కాసేపట్లో ఆయనను ఆయన నివాసం నుంచి బయటకు తీసుకురానున్నారు.

వరవరరావును తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఓ పోలీసు వాహనం అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లోకి వెళ్లింది. కాసేపట్లో ఈ విషయం గురించి పోలీసు అధికారులు మీడియాతో అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే, వరవరరావును నేరుగా పూణెకు తీసుకెళ్తారా? లేదా హైదరాబాదులో కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత పూణెకు తరలిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వరవరరావు నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ లేఖపై దేశవ్యాప్తంగా పలు చోట్లు అకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు పరీధాబాద్ లో ట్రేడ్ యూనియన్ బాధ్యతలను నిర్వహిస్తున్న సుధా భరద్వాజ్ ను కూడా అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles