Atal Bihari Vajpayee last rites at yamuna river bank రాష్ట్రీయ స్మృతిస్థల్ లో అటల్ జీ అంతిమసంస్కారాలు

Atal bihari vajpayee last rites at yamuna river bank

atal bihari vajpayee, yamuna river, rashriya smriti sthal, last rites, atal bihari vajpayee tributes, atal bihari tributes, atal bihari vajpayee condolence, vajpayee crtical, tributes, last rites, delhi, rastriya smruthi sthal, last journey, new delhi, aims, gwalior, special flights, security, hospital, vajpayee house

Former Prime Minister Atal Bihari Vajpayee last rites will be conducted at the Yamuna river bank and Rashtriya smiti dal will be developed at the place.

రాష్ట్రీయ స్మృతిస్థల్ లో అటల్ జీ అంతిమసంస్కారాలు

Posted: 08/16/2018 08:58 PM IST
Atal bihari vajpayee last rites at yamuna river bank

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి వాజ్ పేయి నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. బీజేపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు వాజ్ పేయి నివాసానికి చేరుకుని అంజలి ఘటిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఆయన మృతదేహాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల సందర్శన కోసం ఉంచిన తరువాత మధ్యాహ్నం 1.30 గంటలకు అంతిమయాత్ర, సాయంత్రం 5 గంటలకు విజయ్ ఘాట్ లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి మరణవార్తతో అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర క్యాబినెట్ మహానేత మృతిపై సంతాపం ప్రకటించింది. కాగా దేశ రాజకీయ భీష్ముడు మరణానికి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు కేంద్రం సమాచారం పంపింది. కాగా, ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మరోవైపు యమునానది ఒడ్డున వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, ఆ నది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని నిర్మాణం నిమిత్తం పాత నిబంధనల మార్పు కోసం అవసరమైన ఆర్డినెన్స్ ను తీసుకురానున్నట్టు సమాచారం. రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మాణానికి గాను విజయ్ ఘాట్ లో 1.5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atal bihari vajpayee  last rites  delhi  rashtriya smriti sthal  new delhi  national politics  

Other Articles