KTR urges def min to transfer Hyd defence land కేటీఆర్ ట్వీట్ కు కేంద్రమంత్రి స్పందన ఇదే..

Request 160 acres of defence land for two skyways in hyd ktr tweets def min

Nirmala Sitharaman, Narendra Modi, k t rama rao ,infrastructure, skyways, defence land, bengaluru, land develop, sitharaman, transfer, ktr, Telangana

Telangana Minister KT Rama Rao reiterated the state government's demand to hand over 160 acres of land belonging to the Defence Ministry, for the construction of two skyways in Hyderabad.

కేటీఆర్ ట్వీట్ కు కేంద్రమంత్రి స్పందన ఇదే..

Posted: 08/07/2018 10:16 AM IST
Request 160 acres of defence land for two skyways in hyd ktr tweets def min

రక్షణశాఖ భూముల అప్పగింతలో కేంద్రం వైఖరిపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపై కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ విషయంలో కేటీఆర్ ప్రస్తావించినట్లుగా ఎలాంటి సంశయాలకు తావు లేదని, అయితే జాప్యానికి గల కారణాలపై అమె ఎలాంటి వివరణను ఇవ్వకుండానే.. ఈ క్రమంలో రక్షణ శాఖ అధికారులతో కలసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా భూమి మంజూరుకు కావాల్సిన పరిష్కార చర్యలను తీసుకోవాలని అమె సూచించారు. గతంలోనూ రక్షణ శాఖ భూముల విషయంలో కేటాయింపులు, బదలాయింపుల కోసం మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ తాము ఇదే మార్గాన్ని అనుసరించామని కేంద్రమంత్రి పేర్కోన్నారు.

హైదరాబాద్‌ నుంచి రాకపోకలను సులభం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్డీపీ) కింద రెండు ఆకాశమార్గాల(స్కైవేల) నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. దీనికి 160 ఎకరాల రక్షణశాఖ స్థలం అవసరమని గుర్తించారు. ఈ భూములివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రక్షణశాఖకు రెండేళ్ల కిందట లేఖ రాశారు. మంత్రి కేటీఆర్‌ పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లి, ఇప్పటికి ముగ్గురు రక్షణ మంత్రులు మనోహర్‌ పారికర్‌, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పటివరకూ కేంద్రం అనుమతించలేదు. భూముల  బదలాయింపు సాధ్యం కాదని, దీనికి మూడు రెట్లు భూమి ఇవ్వాలని, రూ.700 కోట్లకు పైగా నిధులివ్వాలని రక్షణశాఖ అభ్యంతరాలు తెలిపింది.

అయితే తాజాగా బెంగళూరులోని మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం 210 ఎకరాల భూ బదలాయింపునకు నిర్మలా సీతారామన్‌ అనుమతించారు. ఈ సమాచారం తెలుసుకొని కేటీఆర్‌ విస్మయం చెందారు. ‘‘వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వం కంటే ముందే మేం రక్షణశాఖ భూములను బదలాయించాలని కోరాం. బెంగళూరుకు ఇచ్చారు. మేం రెండేళ్లుగా కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నా మాకు అనుమతించలేదు. ఇదేం ద్వంద్వనీతి’’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని కూడా పేర్కోన్నారు. దీంతో ముఖ్యమైన స్కైవేల నిర్మాణం ఆగిపోయిందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirmala Sitharaman  Narendra Modi  k t rama rao  infrastructure  skyways  defence land  bengaluru  Telangana  

Other Articles