Sneha Reddy bags Rs 1.2 crore package with Google స్నేహారెడ్డిని గూగుల్ మెచ్చి.. బంపర్ అఫర్ ఇచ్చింది..

Iit h student bags rs 1 2 crore package with google

google, ibrahim dalal, iit-h, iit-hyderabad, kudugunta sneha reddy, google, iit-h student record package, multinational companies, campus placements, ram nath kovind, sneha reddy, warangal, telangana

Kudugunta Sneha Reddy, who graduated from IIT-Hyderabad this year has bagged a whopping Rs 1.2 crore pay package per annum from Google, the highest received by a student in IIT-H’s history

హైదరాబాద్ ఐఐటీ విద్యార్థినిగా చరిత్ర సృష్టించిన స్నేహారెడ్డి

Posted: 08/07/2018 11:02 AM IST
Iit h student bags rs 1 2 crore package with google

దేశవ్యాప్తంగా గూగుల్ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో హైదరాబాద్ ఐఐటీ నుంచి తెలుగమ్మాయి ఎంపికైంది. అమెకు గూగుల్ సంస్థ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఐఐటీ హైదరాబాద్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ దక్కని అరుదైన అవకాశం ఈ అమ్మాయికి లభించింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థినిగా కుడుగంటి స్నేహారెడ్డి చరిత్రను సృష్టించింది. గూగుల్ ఐఐటీ క్యాంపస్ సెలక్షన్లలో కృతిమ మేథపై చేస్తున్న  ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయడానికి దేశవ్యాప్తంగా పలువుర్ని ఎంపిక చేసి అందులోంచి చివరగా ఐదుగురు ప్రతిభావంతులకు నియామకం చేసుకుంది. వీరి ఒక్కొక్కరికీ రూ.1.2 కోట్ల వార్షిక వేతనంతో ఆ సంస్థ ఉద్యోగం ఇచ్చింది.

వికారాబాద్‌కు చెందిన స్నేహారెడ్డి ఐఐటీ హైదరాబాద్‌ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇటీవలే బీటెక్‌ పూర్తి చేశారు. చదువుతోపాటు మిగతా విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన స్నేహా.. తన అత్యుత్తమ ప్రతిభతో ఐఐటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా బంగారు పతకాన్ని సైతం అందుకున్నారు. చదువుతోపాటు కో-కరిక్యులర్ యాక్టివీటిస్ లోనూ చురుగ్గా ఉండే స్నేహారెడ్డి 98.4 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించారు. జేఈఈ 2014 (మెయిన్స్‌)లో ఆలిండియా 15వ ర్యాంకు, జేఈఈ(అడ్వాన్సుడ్‌)లో 677వ ర్యాంకును సాధించారు. తర్వాత ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి బీటెక్ పూర్తిచేసింది.

‘నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్ ‌స్టాండింగ్‌’ ప్రాజెక్టు కోసం గూగుల్‌ సంస్థ ప్రతిభావంతులను ఎంపికచేయడానికి అన్వేషణ ప్రారంభించింది. దీనికి ఆన్ లైన్‌ ద్వారా ఎంపిక నిర్వహించింది. ఇందులో స్నేహారెడ్డి కూడా పాల్గొని తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. తుది ఎంపిక కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉండగా మరో ముఖ్యమైన పరీక్ష ఉండటంతో హాజరు కాలేకపోయారు. అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ తుది పరీక్షను కూడా ఆన్ లైన్ లో నిర్వహించి ఎంపిక చేసింది. విద్యార్థులను పరిశోధనల దిశగా ఐఐటీ అధ్యాపకులు ప్రోత్సహించడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. దీంతో పాటు బీటెక్‌ చదువుతున్నప్పుడే అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కిందని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iit-h student  sneha reddy  iit-hyderabad  google  anantapur  campus placements  

Other Articles