Jazeera flight catches fire but averted జజీరా విమానానికి తప్పిన ముప్పు...!

Jazeera airways flight catches fire while landing in hyderabad

jazeera airways, jazeera airways cathes fire, jazeera airways kuwait-hyderabad flight, flight fire, shamshabad airport, hyderabad airport, Rajiv Gandhi International Airport, india news, indian aviation news, international news

A fire broke out in an engine of Jazeera Airways Kuwait-Hyderabad flight while landing at Rajiv Gandhi International Airport in Hyderabad in the early hours today. All 150 passengers were evacuated safely and the flight is under inspection.

జజీరా విమానానికి తప్పిన ముప్పు.. ప్రయాణికులు సేఫ్..!

Posted: 08/02/2018 03:06 PM IST
Jazeera airways flight catches fire while landing in hyderabad

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. విమాన ఫైలట్ అప్రమత్తతతో వ్యవహరించి.. అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన రెస్కూ సిబ్బంది ప్రమాదం భారి నుంచి ప్రయాణికులను తప్పించగలిగారు. సరిగ్గా అర్థరాత్రి దాటిన తరువాత కువైట్ నుంచి వచ్చిన జజీరా ఎయిర్ లైన్స్ విమానానికి ప్రమాద ఘటన సంభవించింది. 149 మంది ప్రయాణికులందరూ సేఫ్ గా వున్నారని అధికారులు వెల్లడించారు.

సరిగ్గా విమానం రన్ వేపై దిగుతుండగా ఇంజిన్లోంచి ఒక్కసారిగా మంటలు లేచాయి. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. జజీరా ఎయిర్ లైన్స కు చెందిన ఈ విమానం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంట ప్రాంతంలో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో మంటలు రేగడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై అక్కడికక్కడే నిలిపివేసి అధికారులకు సమాచారం అందిచాడు.

పైలట్ సమాచారంపై స్పందించిన విమానాశ్రయం అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం చేరవేయడంతో రన్ వే పై నున్న విమానం వద్దకు చేరకుని మంటలను ఆర్పేశారు. ఓ వైపు మంటలను అదుపు చేస్తూనే విమానంలో ఉన్న 149 ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా దించివేశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించామని ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు. విమానంలో ఎక్కువ మంది పాతబస్తీ వాసులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles