multiplexes, theaters to allow outside food మల్టీఫ్లెక్సులు, థియేటర్లలోకి ఇక బయటి అహారం..

Multiplexes theaters to allow outside food

Maharashtra, Rashtra, Mumbai, India, Professional Information Services - NEC, Movie Theaters, Movie Products, food items, Ravindra Chavan, NSE, INOX Leisure Ltd, MUMBAI, state minister, PVR Ltd, retail price, Rajendra Jadhav, outside

Maharashtra has asked multiplex owners to permit movie-goers to bring their own food items as well as reduce the price of eatables sold inside the premises, a state minister said on Friday.

మల్టీఫ్లెక్సులు, థియేటర్లలోకి ఇక బయటి అహారం..

Posted: 07/13/2018 07:40 PM IST
Multiplexes theaters to allow outside food

మీరు సినీప్రియులా.. షాపింగ్ ప్రేమికులా.. అయితే ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్.. ఏంటదీ.. అంటారా.? మల్టీఫ్లెక్స్ ధియేటర్లకు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లవచ్చునని.. ఇకపై బయటి అహారాన్ని మాల్స్, ధియేటర్లు అడ్డుకోరాదని అదేశాలు వెళ్లాయి. ఔనా..! నిజమేనా.? అంటున్నారా.. నిజమేనండీ అగస్టు మాసం నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. అగస్టు తరువాత ఇక ఏ మల్టీఫ్లెక్సులోకి వెళ్లినా.. ఏ ధియేటర్లోకి సినిమాకెళ్లినా బయటనుంచి అహారాన్ని ముందుగానే కొని తీసుకెళ్లే అవకాశం వుంది.

హమ్మయ్యా.. అంటున్నారా.? కేవలం 50 రూపాయల ఖరీదు కూడా చేయని పాప్ కాన్ లకు 350 రూపాయల ధర పెట్టడం.. మల్టీఫ్లెక్సులు, థియేటర్లలోని ధరలకు ఇదే ప్రత్యామ్నాయం కావడంతో ఈ ధిశగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అయితే ఏ ప్రభుత్వం మేము వినలేదుగా.. అంటారా..  తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాదు.. ఈ అదేశాలను జారీ చేసింది మహారాష్ట్ర సర్కారు. అవును అక్కడి ప్రభుత్వం మల్టీఫ్లెక్సులు, మాల్స్ కు ఆదేశాలు జారీ చేసింది.  మాల్స్ కూడా అనుమతించాలంటూ మహారాష్ట్ర సివిల్ సప్లయ్ మినిస్టర్ రవీంద్ర చవాన్ ప్రకటించారు.

ఇటీవల మహారాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. సినిమా హాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో ఉన్నాయని.. 50 రూపాయల విలువ చేయని పాప్ కార్న్ ఏకంగా 350 రూపాయలు వసూలు చేస్తున్నారని.. బయట 20 రూపాయల కూల్ డ్రింక్.. అక్కడ 150 రూపాయలు వసూలు చేస్తున్నారని ఉద్యమం చేపట్టింది. దీనికితోడు బాంబే హైకోర్టులో పిటీషన్లు వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయట ఫుడ్ ఎందుకు మాల్స్, సినిమా హాల్స్ లోకి తీసుకెళ్లకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

అదే విధంగా ఎందుకు ధరలను నియంత్రించలేకపోతున్నారని నిలదీసింది. సినిమా హాల్స్, మల్టీ ఫ్లెక్సుల్లో ఇతర ఆహార పదార్థాలను అనుమతి ఇవ్వకపోవటం వల్ల.. ధరలు అధికంగా ఉంటున్నాయన్న ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆహార పదార్థాలను ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్నా.. అనుమతించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా ధరలను భారీగా తగ్గించకపోతే ఆయా మల్టీఫ్లెక్సులపై చర్యలు కఠినంగా ఉంటాయని.. దీనిపై ఓ విధివిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. దీంతో ధరల అరాచకానికి చెక్ పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Movie Theaters  Malls  Movie Products  food items  Ravindra Chavan  Maharashtra  

Other Articles