దాదాపుగా 40 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని అనేక చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించిన ఆ నటవిరాటుడు ఇక లేరు. సీనియర్ క్యారెక్టర్ అర్టిస్టుగా అనేక మంది అగ్రహీరోల చిత్రాలలో నటించి.. తన నటనతో మెప్పించిన నటుడు వినోద్.. ఇవాళ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో బ్రెయన్ స్ట్రోక్ తో అకస్మికంగా అనంతలోకాలకు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించిన ఆయన అటు విలన్ గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు.
వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వి.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కీర్తి కాంత కనకం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో వినోద్ ప్రస్థానం ప్రారంభమైంది. ఇందులో కథానాయకుడిగా నటించిన వినోద్, చంటి సినిమాలో పోషించిన అన్న పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. సీనియర్ నటుడు వినోద్.. ఇకలేరన్న వార్త టాలీవుడ్ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
ఫ్యాక్షన్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న వినోద్ కు.. భార్య వీనావతి. వీరికి శిరీష, సురేష్, తేజస్వి అను ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వినోద్ మృతిపట్ల పలువురు ప్రముఖ నటులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. వినోద్ నివాసానికి వెళ్లి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more