99TV Telugu news channel management changed న్యూ వేవ్స్ చేతికి 99 టీవీ న్యూస్ ఛానెల్

99tv telugu news channel management taken up by new waves

cpi, tv 99, 99 tv, new waves, media, new channel, channel taken up, tv 99 taken up by new waves, andhra pradesh, telangana, politics, telugu states

99TV Telugu news channel which was officially managed by the cpi party and cpi leader narayana has been taken up by new waves

న్యూ వేవ్స్ చేతికి 99 టీవీ న్యూస్ ఛానెల్

Posted: 07/11/2018 12:00 PM IST
99tv telugu news channel management taken up by new waves

మీడియా అంటే కత్తి మీద సాము.. ఈ రోజుల్లో నిజమైన వార్తలను నిష్పక్షపాతంగా చూపించడంలో చానెళ్లు విఫలమయ్యాయన్న విమర్శలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ఎవరి పక్షాన నిలబడకుండా.. వున్నది వున్నట్లుగా, క్లుప్తంగా, జనపక్షం వహించి వార్తలను అందించే ఒక వెబ్ పోర్టల్, వెబ్ ఛానెల్.. మరో ముందడుగు వేసింది. అర్థికపర అంశాలతో సతమతమవుతున్న టీవీ 99 ఛానెల్ ను న్యూ వేవ్స్ సంస్థ అందిపుచ్చుకుంది. గత కొన్ని రోజులుగా ఈ అంశానికి సంబంధించిన చర్చలు పూర్తి కావడంతో ఇవాళ అధికారికంగా న్యూ వేస్స్ సంస్థ టీవీ 99 యాజమాన్య హక్కులను అందుకుంది.

అయితే టీవీ 99 లోగోను యాజమాన్యం మార్చుతుందా.? లేక అదే లోగోను కొనసాగిస్తుందా.? అన్నది కూడా తెలియాల్సి వుంది. ఈ నేపథ్యంలో న్యూ వేస్స్ సంస్థ ఇవాళ ఒక శుభముహూర్తాన పూజా కార్యక్రమాలను నిర్వహించింది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, రాజకీయ విశ్లేషకుడు, వ్యాపారవేత్త దిలిప్ బైరా, సీపిఐ నారాయణ, జ్యోతుల వెంకటేశ్వరరావు, మారిశెట్టి రాఘవయ్య, టీసీ అశోక్, శీనుబాబు, రాఘవయ్య, మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cpi  tv 99  99 tv  new waves  media  andhra pradesh  telangana  politics  telugu states  

Other Articles