Techie who raped and killed 7-yr-old will hang: HC ఆ సాప్ట్ వేర్ ఉద్యోగికి మరణశిక్షే సరి: హైకోర్టు

Will hang to death madras hc to techie who raped and murdered minor girl

Madras High Court, Chennai rape case, HC award death sentence, 7-year-old girl raped and murder, Tamil Nadu, crime

Pronouncing the verdict on the Chennai's heinous rape case of a 7 year minor girl, Madras High Court ruled 'the convict will hang'.

ఆ సాప్ట్ వేర్ ఉద్యోగికి మరణశిక్షే సరి: హైకోర్టు

Posted: 07/11/2018 01:01 PM IST
Will hang to death madras hc to techie who raped and murdered minor girl

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు వేసిన పిటీషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించి.. వారికి కు ఉరి శిక్షే సరైందని తీర్పును వెలువరించిన క్రమంలో మరో హంతకుడు, కామాంధుడికి కూడా మద్రాసు హైకోర్టు అదే తీర్పును సరైందని తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ.. మైనర్ బాలికపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్యచేసిన టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్‌ హైకోర్టు సమర్ధించింది.

వివరా్లోలకి వెళ్తే.. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సాప్ట్ వేర్ ఉద్యోగి దశ్వంత్‌.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి…ఆ బాలిక మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు. పాప అచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులకు పాప శవం కనిపించడంతో గుండలవిసేలా రోధించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది.

కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడి సంబంధించిన కీలక అధారాలన్నింటినీ తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్‌ కోర్టు దశ్వంత్ కు ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దశ్వంత్ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. దిగువ న్యాయస్థానం వెలువరించిన తీర్పును సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌కు ఉరిశిక్ష సరైనదే అంటూ తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles