Chaiwala.. PM because Congress Preserved democracy ఛాయ్ వాలా ప్రధాని అయ్యారంటే.. అది కాంగ్రెస్ చలవే..

Tea vendor became pm because congress preserved democracy

mallikarjun kharge modi, mallikarjun kharge congress. mallikarjun kharge chaiwala pm, mallikarjun kharge democracy, mallikarjun kharge news, mallikarjun kharge congress, mallikarjun kharge profile, chaiwala modi, acche diin, congress, rahul gandhi, politics

In a jibe at PM Modi, senior Congress leader and former Union Minister Mallikarjun Kharge has said that a “chaiwala” could become the PM of the country only because his party preserved democracy.

ఛాయ్ వాలా ప్రధాని అయ్యారంటే.. అది కాంగ్రెస్ చలవే..

Posted: 07/09/2018 02:03 PM IST
Tea vendor became pm because congress preserved democracy

ప్రధాని నరేంద్ర మోడీ 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ అప్పటి పరిస్థితుల్లో తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయంతో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని విమర్శించన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై గట్టిగానే సమాధానమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వల్లే ఒక దేశంలో ఒక సాధారణ చాయ్ వాలా కూడా ఇవాళ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించగలిగాడని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర‌ ఇన్ ఛార్జి మల్లికార్జున్‌‌ ఖర్గే అన్నారు. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఖర్గే ప్రధాని, కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘గత 70ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి కార్యక్రమంలో అడుగుతూ ఉంటారు. మేము దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాము కాబట్టే ఓ చాయ్ వాలా ప్రధాన మంత్రి అయ్యారు.’ అని పేర్కొన్నారు. మాట మాట్లాడితే కాంగ్రెస్ చేసిన పనులను అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలను ఎత్తి చూపి తప్పిదాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రధాని మోదీకి.. కాంగ్రెస్ చేసిన అభివృద్ది.. దేశంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు మాత్రం కనబడటం లేదని ఆయన చురకలంటించారు.

ప్రధాని మోడీ గత నాలుగేళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఆ పథకాలన్నీ విఫలమయ్యాయని దుయ్యబట్టారు. బీజేపి ఉద్దేశపూర్వకంగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల వ్యక్తిత్వాలపై దాడి చేస్తోందని, కాంగ్రెస్‌ పార్టీ ఓ కుటుంబం వంటిందని, తామంతా అందులో సభ్యులమని వెల్లడించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయ రంగానికి చెందిన పథకాలు విఫలమవుతున్నాయిన విమర్శించారు. మోదీ ప్రభుత్వం పడిపోతేనే ప్రజలకు ‘అచ్ఛే దిన్‌’ వస్తుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mallikarjun kharge  chaiwala  PM modi  acche diin  congress  rahul gandhi  politics  

Other Articles