Kathi Mahesh externed from Hyderabad for six months ‘‘నగరంలోకి ఎంటరైనా.. ట్వీట్లు చేసినా.. కత్తికి మూడేళ్ల జైలు’’:డీజీపీ

Telangana police ban film critic mahesh kathi from entering hyd for 6 months

kathi mahesh telangan dgp, kathi mahesh mahender reddy, hyderabad police, kathi mahesh barres form city, paripoornanada swamy house arrest, paripoornanada swami kathi mahesh, paripoornanada swami dharmagraha yatra, kathi mahesh paripoornanada swamy, kathi mahesh bigboss, kathi mahesh controversial remarks, kathi mahesh twitter, dgp mahender reddy, kathi mahesh, controversial statements, paripoornanada swamy, dharmagraha yatra, Telangana

Telangana DGP Mahender Reddy blamed Mahesh Kathi for causing unrest and has taken him out of Hyderabad and dropped him in his native Chittoor district.

‘‘నగరంలోకి ఎంటరైనా.. ట్వీట్లు చేసినా.. కత్తికి మూడేళ్ల జైలు’’:డీజీపీ

Posted: 07/09/2018 02:48 PM IST
Telangana police ban film critic mahesh kathi from entering hyd for 6 months

భావ వ్యక్తీకరణ హక్కు పేరుతో ఇతరుల మనోభావాలను గాయపర్చేలా వ్యాఖ్యలు చేయడం నేరమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే, చర్యలు తప్పవని గుర్తంచుకోవాలని సూచించారు. హక్కుల పేరుతో ప్రజల్లోని విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయనను తీసుకెళ్లి, ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని చెప్పారు. ఈ క్రమంలో ఆయనపై రాష్ట్ర బహిష్కరణను కూడా విధించే అవకాశముంటుందని చెప్పారు.

ఇక కత్తి మహేష్ తన సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వీలులేదని.. అలా చేసినా అది నేరమ అవుతుందని మహేందర్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని డీజీపీ తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రచారం కల్పించరాదని మీడియాను కోరుతున్నామని తెలిపారు.

అయితే కత్తి మహేష్ వార్తలను పదే పదే ప్రసారం చేసి.. విధ్వేషాలను రెచ్చగొట్టేన టీవీ ఛానెళ్లకు కూడా షోకాజ్ నోటీసులు అందజేశామని చెప్పారు. ప్రోగ్రామ్ కోడ్ ను అతిక్రమించిన ఛానళ్లకు నోటీసులిచ్చామని వెల్లడించారు. వారు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన తరువాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తామని చెప్పారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా... రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles