Mamata Banerjee loses cool, slams Karnataka DGP కర్ణాటక డీజీపీపై పశ్చిమబెంగాల్ సీఎం ఫైర్..

Mamata banerjee loses cool after being forced to walk slams karnataka dgp

Mamata Banerjee, Congress, H. D. Deve Gowda, H. D. Kumaraswamy, Nationalist Congress Party, Sharad Pawar, Vajubhai Vala, Janata Dal, Vidhana Soudha, West Bengal

West Bengal Chief Minister Mamata Banerjee was forced to walk a short distance to reach the Vidhana Soudha (state assembly) for the swearing-in, as traffic hurled at the venue. Who came to the venue and slams Karnataka DGP, Neelamani Raju.

ITEMVIDEOS: కర్ణాటక డీజీపీపై పశ్చిమబెంగాల్ సీఎం ఫైర్..

Posted: 05/24/2018 10:42 AM IST
Mamata banerjee loses cool after being forced to walk slams karnataka dgp

జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీయేతర పార్టీలన్నీ ఆద్యంతం ఉత్సాహంగా కనిపించాయి. తమ బలప్రదర్శనకు ఇది చక్కని వేదికగా నిలిచిందని కూడా ఆయా పక్షాలన్ని సంతోషంగా కనిపించాయి. 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ప్రమాణ స్వీకార వేదికపై కనిపించింది. బీజేపీ యేతర పార్టీ నాయకులతో వేదిక నిండిపోయింది. అయితే, ఇదే కార్యక్రమానికి హాజరైన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం వేదిక వద్దకు వచ్చీ రాగానే కొంత అసహనానికి గురయ్యారు. ఎందుకుని అంటారా..?

అమె తన కారులో బెంగుళూరులోని విధాన సౌధా అసెంబ్లీకి చేరుకునేందుకు వస్తుండగా, తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విధానసౌదకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రముఖలు హాజరుకావడంతో వారి వాహనాలతో అసెంబ్లీ ప్రాంగణమంతా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. దీంతో తాను కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సమాయానికి చేరుకుంటానా.? లేదా.? అన్న అనుమానంతో అమె కారు దిగి కొంత దూరం నడుచుకుంటూ విధానసౌధకు చేరుకున్నారు. దీంతో అమె వేదిక వద్దకు వచ్చి రాగానే ట్రాపిక్ జామ్ విషయమై కర్ణాటక డీజీపీ నీలమణి రాజుతో ఈ సమస్యపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏంటీ ఏర్పాట్లు? ఎంత మంది ప్రముఖులు వస్తున్నారన్న విషయమై సమాచారం లేదా.? ఉన్నప్పుడు వారి వాహనాలకు అంతరాయం కలగకుండా నేరుగా వేదికకు చేరుకునేలా ఏర్పాటు చేయలేరా.? అంటూ చీవాట్లు పెట్టారు. ఆమె ఆగ్రహాన్ని చూసి కుమారస్వామి, దేవెగౌడ, ఇతర నేతలు బిత్తరపోయారు. ప్రమాణస్వీకారం కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్న మమత నేరుగా విధానసౌధకు బయలుదేరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీవీఐపీలు, కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు హాజరుకావడంతో ఆమె వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఎదురయ్యాయి. డీజీపీపై మమత ఆగ్రహానికి ఇదే కారణమని చెబుతున్నారు. పోలీస్ బాస్‌పై ఫైర్ అవుతున్న మమత వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles