Petrol price hits new high; Nitin gadkari key statements on fuel prices కొత్త శిఖరాలకు ఇం‘ధరలు’.. రూ.25 తగ్గించవచ్చునన్న కేంద్రమాజీ మంత్రి

Petrol price hits new high nitin gadkari key statements on fuel prices

petrol price, petrol price today, petrol price hike, diesel price today, petrol price in new delhi, petro price in mumbai, diesel price in new delhi, statewise petrol price, narendra modi, bharatiya janata party, nitin gadkari, fuel prices

Rising fuel prices have set off a political firestorm in the past few days as petrol and diesel rates have skyrocketed. On Thursday, petrol price touched Rs 85.29 per litre in Mumbai, while in Delhi the price inched higher to a new record of Rs 77.47 per litre.

కొత్త శిఖరాలకు ఇం‘ధరలు’.. రూ.25 తగ్గించవచ్చునన్న కేంద్రమాజీ మంత్రి

Posted: 05/24/2018 10:01 AM IST
Petrol price hits new high nitin gadkari key statements on fuel prices

దేశీయంగా ఇంధనం మండుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అకాశానంటుతున్నాయి. డీజిల్ ధరల ప్రభావం రవాణ వ్యవస్థపై పడి నిత్యావసర సరుకులు, రవాణ రంగం ధరలను కూడా అంతకంతకూ పెంచుతున్నాయి. క్రమంగా ద్రవ్యోల్భణం కూడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే వరుసగా పదో రోజు పెరిగిన పెట్రోల్ ధర..ఆల్ టైమ్ హై రికార్డును కూడా అందుకుంది. తాజాగా ఇవాళ కూడా స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు ఏకంగా గత మే 14 తరువాత నుంచి లీటరుకు రూ.2.5గా పెరిగింది.

పెట్రోల్ ధరలను అంతర్జాతీయంగా 80 డాలర్లరు వుంటేనే ప్రభుత్వం దానిని ఏకంగా దేశరాజధాని ఢిల్లీలో 77.47 రూపాయలకు లీటర్ విక్రయిస్తుండగా, దేశ అర్థిక రాజధాని ముంబైలో 85.29కు లీటర్ పెట్రోల్ లభ్యవమతుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే.. లీటర్ డీజిల్ ఢిల్లీలో 68.53కు, ముంబైలో 72.96కు లీటర్ లభ్యంకానుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు ఏకంగా పైపైకి ఎగబాకడంపై దేశ ప్రజల నుంచి ఉవ్వెత్తున్న నిరసన వెల్లివిరుస్తుంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా లీటరు పెట్రోల్ ధరపై రూ.25 వరకు తగ్గించవచ్చునని కేంద్ర మాజీ అర్ధిక శాఖ మంత్రి చిదంబరం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మాత్రం ఆ పని చేయకుండా కేవలం రూపాయి లేదా రెండు రూపాయలను మాత్రమే తగ్గించి ప్రజలను వంచన చేస్తుందని ఆయన తనదైన శైలిలో ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. తమ ప్రభుత్వం అధికారిన్ని అప్పగించిన నాటి నుంచి నేటి వరకు కేంద్రం లీటరు పై ఏకంగా 15 రూపాయల మేర అర్జిస్తూ సొమ్మచేసుకుంటుందని చిదంబరం అరోపించారు. ఇంధన ధరల తగ్గడంతో రూ.15, ఇక ఎక్సైజ్ సుంఖం పేరుతో మరో పది చేర్చి కేంద్రం నిధులను పోగేసుకోవడంపైనే ద్యాస చూపుతుందని విమర్శించారు.

అయితే చిదంబరం అరోపణలపై పరోక్షంగా స్పందించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు కష్టతరం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మరికొన్ని పథకాలకు రూపకల్పన చేస్తుందని చెప్పిన ఆయన, పెట్రోలు, డీజిల్ ధరలపై సబ్సిడీ ఇస్తే, దాని ప్రభావం పథకాలపై పడుతుందని అభిప్రాయపడ్డారు.  కాగా, సమీప భవిష్యత్తులో పెట్రోలు ధర లీటరుకు రూ. 100 మార్క్ ను తాకుతుందని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, ధరల పెరుగుదలకు మీరంటే మీరే కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.

"మనం ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్రోలు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడివున్నాయి. ప్రజలకు ఊరట లభించేలా మనం 'పెట్రో' ఉత్పత్తులను చౌకగా విక్రయించాలంటే, అధిక ధరలకు వాటిని కొని, సబ్సిడీ అందించాల్సిందే. పెట్రోలుపై సబ్సిడీ అంటే, సంక్షేమ పథకాలకు వాడుతున్న డబ్బంతా ఆవిరైపోతుంది. సబ్సిడీ అందిస్తే, మనవద్ద అతికొద్ది మొత్తంలో మాత్రమే డబ్బుంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పెట్రోలుపై పన్నులను తగ్గించినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, పేదలకు ఉచిత ఎల్పీజీని అందించే ఉజ్వలా స్కీమ్ తో పాటు, నీటి పారుదల పథకాలు, గ్రామీణ విద్యుదీకరణ పథకాలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles