newly wedded wife murders husband for sake of lover ప్రియుడి కోసం.. భర్తను హత్యచేయించిన నవవధువు

Newly wedded wife murders husband for sake of lover

another swathi case in vizianagaram, gauri shanker rao, saraswathi, saraswati, wife supari for husband murder, newly wedded wife, power plant employee, siva, shiva, vizianagaram murder, gauri shanker rao murder, vizianagaram, andhra pradesh, crime

yet another swathi case registerd in vizianagaram district, whete newly wedded wife saraswathi murders husband gouri shanker for sake of lover.

ప్రియుడి కోసం.. భర్తను హత్యచేయించిన నవవధువు

Posted: 05/08/2018 12:03 PM IST
Newly wedded wife murders husband for sake of lover

విజయనగరం జిల్లాలో మరో స్వాతి తరహా కేసు నమోదైంది. పది రోజులు కూడా నిండకుండానే.. పసుపు పారణి అరకముందే కొత్త పెళ్లికొడుకు హత్యచేయబడిన ఘటన విజయనగరం జిల్లాలోని గురుగుబిల్లిలో కలకలం సృష్టించగా, ప్రియుడిని విడిచి వుండలేకే భర్త హత్యకు స్కేచ్ వేసి పక్కాగా అమలు చేయించింది నవ వధువు. సోమవారం రాత్రి నవజంట.. వ్యాహ్యాళికి వెళ్లగా, ఇద్దరు దుండగులు దాడి చేసి యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కాగా, వారి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా చిట్టిపూడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుకు, విజయనగరం జిల్లా కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి గత నెల 28న పెద్దలు వివాహం జరిపించారు. వీరిద్దరూ బావా, మరదులే కావడం గమనార్హం. అయితే సరస్వతి అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమించింది. మేనబావతో వివాహం ఇష్టం లేని సరస్వతి, తన మిత్రుడు శివ, విశాఖపట్నం రౌడీషీటర్ గోపీల సాయంతో భర్తను హత్య చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనపైనా దాడి చేయించుకుంది. అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విచారణలో భాగంగా పోలీసులు హైవేపై తనిఖీలు చేస్తుండగా శివ, గోపీలు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా వెళుతూ, ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని టేకోవర్ చేసింది. దీంతో ఆ ఆటోను ఆపిన ఎస్పీ, వారిని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన, వారిని పోలీసులకు అప్పగించారు. సరస్వతిపై దాడి చేసిన వారు వీరేమోనన్న అనుమానంతో పోలీసులు విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

కాగా, సరస్వతిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అమె ఫోన్ ను స్వాధీనం చేసుకుని అధారాల కోసం కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పెళ్లి ముందే శివ తనకు పరిచయమని అంగీకరించిన సరస్వతి, అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తమ కుటుంబసభ్యులు మేనబావతో వివాహం నిశ్చయించారని.. ఈ పెళ్లి వద్దని, తనకు ఇష్టం లేదని చెబుతున్నా, బలవంతంగా చేశారని చెప్పింది. తన భర్త శంకర్ రావు పవర్ ప్లాంట్ లో పనిచేస్తుంటాడని, మంచి వ్యక్తేనని తనను బాగా చూసుకున్నాడని అంగీకరిస్తూనే, శివను విడిచి ఉండలేక ఈ పని చేశానని విలపించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saraswathi  gauri shanker rao  shiva  gauri shanker rao murder  vizianagaram  andhra pradesh  crime  

Other Articles

 • Deaths due to swine flu pose concern in hyderabad

  నగరవాసులకు హెల్త్ అలెర్ట్: విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

  Oct 18 | రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా వుండాలని తెలంగాణ వైద్య, అరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వైన్‌ప్లూ వేగంగా విస్తరిస్తోందని, జాగ్రత్తగా... Read more

 • Pawan kalyan warns tdp government on his srikakulam visit

  టీడీపీ నేతలకు జనసేనాని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

  Oct 18 | జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరగా, విజయవాడకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రకటించారు. ఇక తాజాగా... Read more

 • Tension at peak on second day at sabarimala 144 section imposed

  రెండో రోజు అదే సీన్..శబరిమల వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్..

  Oct 18 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తలుపులు తెరిసిన తరువాత ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళా భక్తులకు రెండో రోజు కూడా చుక్కెదురవుతుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు... Read more

 • Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

  నేడే విజయదశిమి.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

  Oct 18 | ఇంద్రకిలాద్రిపై గత ఎనమిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇశాళ సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు అభయప్రధానం చేసిన తరువాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... Read more

 • Tirumala bramostavam concludes with chakra snanam

  ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

  Oct 18 | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున చక్రస్నానంతో ముగింపుకు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై నిర్వహించిన ఊరేగింపుతో వాహనసేవలు ముగింపుకు చేరుకున్నాయి. తిరుమల నవరాత్రి  బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారికి... Read more

Today on Telugu Wishesh