Delhi cops give tricolour burial to peacock ఢిల్లీ పోలీసుల తీరుపై వ్యక్తమవుతున్న అగ్రహజ్వాలలు

Peacock gets martyr like tricolour burial activists fume over code violation

delhi peacock burial, National flag, Jain Bird Hospital, Delhi Police, dead peacock buried with tricolour, peacock burial, delhi police, peacock death, wildlife act, wildlife activists,peacock, martyr honour, tri colour flag, national flag, Delhi Police, high court, Jain Bird Hospital, delhi

Tricolour burial is mark of martyrs. However, the Delhi Police chose to bestow this honour on a peacock, which is the the National Bird of India.

ఢిల్లీ పోలీసుల తీరుపై వ్యక్తమవుతున్న అగ్రహజ్వాలలు

Posted: 05/08/2018 12:35 PM IST
Peacock gets martyr like tricolour burial activists fume over code violation

దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు తీరుపై అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణమవుతుంది. యుద్ధాల్లో వీరమరణం పొందిన అమరజవాన్లకు, లేక జాతీయ స్థాయిలో, లేక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో బాగమై, ఉన్నత హోదాలను చేపట్టిన రాజకీయ నేతలకు.. ప్రభుత్వమే తమ సొంతఖర్చుతో... అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అయితే ఢిల్లీకి చెందిన కొందరు పోలీసులు చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.

అది కాస్తా వివాదాస్పదంగా మారింది. అమరజవాన్లకు మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని ఢిల్లీ పోలీసులు అపహాస్యం చేస్తున్నారని పలువురు వాదిస్తుండగా, వన్యప్రాణి సంరక్షణ సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా దీనిపై అక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పక్షికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వల్ల అది ఎలా చనిపోయిందన్న వివరాలను బయటకు రాకుండా అడ్డుకట్ట వేయడమేనని మండిపడుతున్నారు. అసలు నెమళ్లు కానీ లేక ఏ వన్యప్రాణి మరణించినా.. అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులకు ముందుగా సమాచారం అందించే0లా ప్రతీ పోలీస్ స్టేషన్లకు అదేశాలను జారీ చేయాల్సిందిగా వన్యప్రాణి సంరక్షణ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని హైకోర్టు పరిసరాల్లో గాయాలతో కన్పించిన ఓ నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటి నిండా గాయాలతో వున్న జాతీయ పక్షిని పోలీసులు జైన్ బోర్డ్ అసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులు పరిశీలించి.. అది చనిపోయిందని వెల్లడించారు. దీంతో పోలీసులు దానికి అంత్యక్రియలు చేయాలని నిర్వహించి.. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి చెక్క పెట్టలో ఉంచి అధికార లాంఛనాల మాదిరిగా ఘట్టాన్ని పూర్తి చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాం. ఇది ప్రొటోకాల్‌. మున్ముందు ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

చనిపోయిన ఈ నెమలి షెడ్యూల్‌-1కు చెందిన పక్షి. అంటే 1972 వన్యసంరక్షణ చట్టం ప్రకారం ఈ పక్షి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇలాంటి కోవకు చెందిన నెమళ్లు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అలాంటిది చనిపోయిన నెమలిని అటవీ శాఖకు అప్పగించకుండా పోలీసులే సొంతంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peacock  martyr honour  tri colour flag  national flag  Delhi Police  high court  Jain Bird Hospital  delhi  

Other Articles