pawan kalyan cancels his karnataka election campaign కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లడంలేదు: జనసేన

Pawan kalyan cancels his karnataka election campaign

pawan kalyan, janasena, star campaigner, JDS, janata dal secular, karnataka, assembly elections, telangana, Pawan Kalyan Political Yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gets busy with strenthening his own party from booth level, hence he cancelled his karnataka election campaign on behalf of janata dal secular party.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లడంలేదు: జనసేన

Posted: 05/02/2018 10:29 AM IST
Pawan kalyan cancels his karnataka election campaign

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున జనసేన అధినేత, పవర్ స్టార్ ప్రచారం చేస్తారన్న వార్తలను స్వయంగా జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో.. ఎప్పుడు వెళ్తారన్న విషయమై అక్కడి పవన్ అభిమానులు ఎదురుచూపులకు ఇక నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న అలోచనలకు ప్రస్తుతానికి పవన్ కల్యాన్ వెళ్లడం లేదని జనసేన స్పష్టం చేసింది.

తమ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే కార్యక్రమాలలో పవన్ ప్రస్తుతం బిజీగా వున్నారని.. అదే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో వచ్చిన కర్ణాటక ఎన్నికలలో అక్కడి వెళ్లి ప్రచారం చేయాలన్న అలోచనను జనసేన విరమించుకుందని ఆ పార్టీ వెల్లడించింది. వాస్తవానికి పవన్ కర్ణాటక పర్యటనపై ఆది నుంచి అనుమానాలే నెలకోన్నా.. తాజాగా జనసేన ఈ నిర్ణయాన్ని స్పష్టం చేయడంతో కర్ణాటకలోని ఆయన అభిమానులు పవన్ వస్తున్నాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. తాజా నిర్ణయంతో వారి ఎదురుచూపులు ఫలించలేదు.

జేడీఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఒకసారి, ఎన్నికల బరిలో వున్న తమ స్నేహితులకు మాత్రమే పవన్ ప్రచారం చేస్తారని మరోమారు వార్తలు వచ్చినా.. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి తమ ప్రచారంలో పవన్ ను కూడా స్టార్ ప్రచారకర్తగా పేర్కోన్న నేపథ్యంలో జనసేనాని వారి తరపున ప్రచారం చేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఓట్లు వేయరాదని పవన్ కన్నడనాట ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు డిమాండ్ చేసినా, పవన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. కాగా, హోదా సాధన, విభజన హామీల అమలే లక్ష్యంగా ఈ నెల 11న తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles