Boy narrowly escapes being run over by bus బస్సు కింద పడి వెంట్రుకవాసిలో తప్పించుకున్న చిన్నారి..

Boy narrowly escapes being run over by bus after tripping over guard rails

boy narrow escape run over by bus, boy escapes accident, school boy narrow escape, boy escapes accident, accident, six year old boy, school boy, mother shock, boy escapes death, narrow escape, Chongqing Municipality, china, viral video, social media

Surveillance footage shows a six-year-old boy narrowly escape being run over by a bus after he tripped over guardrails in southwest China's Chongqing Municipality on April 25, which goes viral on social media

బస్సు కింద పడి.. వెంట్రుకవాసిలో తప్పించుకున్న చిన్నారి..

Posted: 05/02/2018 11:09 AM IST
Boy narrowly escapes being run over by bus after tripping over guard rails

రోడ్డుపై వెళ్తునప్పుడు తల్లిదండ్రుల చేతులు పట్టుకుని నడవాలని పాఠశాల పుస్తకాల్లో వున్నా.. తల్లిదండ్రులు చెబుతున్నా పిల్లలు లక్ష్యపెట్టరు. చెయ్యి వదులు అంటూ ఏడుస్తారు.. తాము మీ వెంటే వస్తామని అంటారు.. ఇంకోదరైతే మరీ మారం చేసి.. తమ దారిన తాము వస్తామని కూడా తెగేసి చెబుతారు. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు ఇంటికెళ్లిన తరువాతే నీ ఇష్టం.. దారిపోడుగునా మాత్రం నా చేయి పట్టుకోవాలని హుకుం జారీ చేస్తారు. ఇది పిల్లలకే కాదు.. చూసిన వారికి కూడా ఫుట్ పాత్ పైన నడుస్తూ కూడా ఇన్ని అంక్షలు పెడతారా.? అంటూ విమర్శిస్తారు.

అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు తమతోనే వస్తున్నారు కదా అంటూ.. వారి చేతులు వదిలేస్తారు. ఇలా వదిలేయడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ ఆరేళ్ల చిన్నారిని పాఠశాల నుంచి తల్లి నడుచుకూంటూ ఇంటికి తీసుకెళుతోంది. అయితే, రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ బాలుడు ఆడుకుంటూ మెల్లిగా నడుస్తున్నాడు. తల్లి దూరం వెళ్లిందని చూసి పరుగెడుతూ అమెను చేరుకోవాడానికి ప్రయత్నించాడు.

తల్లిని సమీపించిన తరువాత అమె ముందుకు వెళ్లగానే గెంటసాగాడు. అంతే ఫుట్ పాత్ పై వున్నవారు రోడ్డుపైకి వెళ్లకుండా అడ్డుగా వున్న గార్డ్ రైల్స్ తగిలి ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో ఎదురుగా వేగంగా ఓ బస్సు వచ్చింది. సరిగ్గా దాని కింద పడ్డాడు. అయితే అదృష్టం బాగుండి బస్సు వెనుక టైర్ల వెళ్లిన తరువాత బస్సు కిందకు వెళ్లాడు. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా తల్లికి గుండె అగినంతపనైపోయింది. వెంటనే తేరుకుని చిన్నారిని లేపి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ బాలుడికి స్వల్పగాయం అయింది. ఈ ఘటన చైనాలోని చోన్ క్వింగ్ లో గత నెల 25న చోటు చేసుకోగా.. స్థానికంగా వున్న సిసీటీవీలు ఈ ఘటనను నిక్షిప్తం చేశారు. దానిని ఈ నెల 1న యూట్యూబ్ లో పోస్టు చేయగా, అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles