Telangana mulls high level committee to prevent casting couch సినీఇండస్ట్రీలో సమస్యలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు

Telangana mulls high level committee to prevent casting couch

Talasani Srinivas Yadav, MAA Association, state government Jana sena, Pawan Kalyan, Ravi prakash, TDP, ap special status, transpperancy politics, corrupted allegations, TDP MPs, TDP yellow media, Andhra pradesh, special status, andhra pradesh, politics

Minister for Cinematography Talasani Srinivas Yadav had a meeting with senior police officials and members of Telugu film industry at his chambers in the Secretariat, and took serious steps to stops the row over alleged casting couch.

సినీఇండస్ట్రీలో సమస్యలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు

Posted: 04/21/2018 06:38 PM IST
Telangana mulls high level committee to prevent casting couch

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ పెద్దలతో ఈ రోజు చర్చలు జరిపింది. తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

కీలక నిర్ణయాలివే...
* చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు
* సినీ పరిశ్రమలో మధ్యవర్తులకు చెక్
* నటీనటులకు మేనేజర్ల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు
* మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో నిలిపివేయాలని పరిశ్రమను, మీడియాను కోరుతున్నానని అన్నారు. మహిళలు, నటులు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. కాగా ఈ సమావేశానికి మా అధ్యక్షుడు శివాజీ రాజా, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్, టీఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, ఎన్. శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ కీలక నిర్ణయాలపై ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్న బాధితులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles