Pawan Kalyan reveals real agnyaathavaasi అజ్ఞాతవాసి గుట్టువిప్పిన పవన్,

Pawan kalyan reveals real agnyaathavaasi behind the episode

Jana sena, Pawan Kalyan, twitter, transperancy politics, Agnyaathavasi, Sri reddy, kathi mahesh, Ravi prakash, TDP, ap special status, transpperancy politics, corrupted allegations, TDP MPs, TDP yellow media, Andhra pradesh, special status, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan reveals the real agnyaathavaasi behind the entire sri reddy and kathi mahesh episode.

అజ్ఞాతవాసి గుట్టువిప్పిన పవన్, అభిమానులకు సూచనలు

Posted: 04/21/2018 05:13 PM IST
Pawan kalyan reveals real agnyaathavaasi behind the episode

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్.. ఈ మొత్తం వ్యవహారం వెనుకనున్న అసలైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా అంటూ ట్విట్ చేసి.. సదరు వ్యక్తిని అభివర్ణిస్తూ.. ఆయన్ని లక్ష్యంగా చేసుకుని, అతనో బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయాన్ని ఓ సీఎం తన మంత్రి వద్ద అన్నారని పవన్ తన ట్వీట్లలో పేర్కోన్నారు. అయితే ఆయన ఎవరా అని ఎదరు చూసిన అభిమానులకు ఇవాళ సాయంత్రం అతని పేరును వెల్లడించారు పవన్.

హైదరాబాద్ లోనే వుండి.. "నిజాలను నిగ్గు తేలుద్దాం" ప్రోగ్రాం నుంచి తాను లైవ్ లో అప్ డేట్స్ ఇస్తానని చెప్పిన పవన్ అన్న మాట ప్రకారం అజ్ఙాతవాసి పేరును వెల్లడించారు. ఆయన మరోవరో కాదు టీవీ9 సీఈఓ రవిప్రకాష్ అని తేల్చేశారు. తనకు సంబంధం లేని విషయాల్లోని తనను లాగి తనను ఎనమిది నెలలుగా తిట్టిస్తూ, పైశాచిక అనందం పోందినా.. తృప్తి చెందని వ్యక్తి రవిప్రకాష్ అని పేర్కోన్నారు, తనను తిట్టించింది చాలదన్నట్లు తన తల్లిని కూడా తిట్టించాడని అరోపించారు.

 టీవీ 9 యజమాని శ్రీనిరాజుపై కూడా పవన్ కల్యాన్ నిప్పులు చెరిగారు. టీవీ 9 చానెల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిందని, రవిప్రకాష్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని అన్నారు. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles