AP Police Warns Political Leaders On Andhra Bandh నవ్యాంధ్రలో బంద్.. స్థంభించిన జనజీవనం..

Special status statewide bandh in andhra pradesh

Prathyeka Hodha Sadhana Samiti, YSRCP, Jana Sena, Pawan Kalyan, YS Jagan, Ruling TDP, chandrababu naidu, APSRTC buses, schools and colleges, left parties, andhra pradesh special status, andhra pradesh, politics

AP Bandh called by Prathyeka Hodha Sadhana Committee and supported by most political parties including YSRCP, Congress and the Left started off on a peaceful note on Monday. Interestingly, the ruling Telugu Desam Party has refused to back the bandh.

నవ్యాంధ్రలో బంద్.. స్థంభించిన జనజీవనం..

Posted: 04/16/2018 10:14 AM IST
Special status statewide bandh in andhra pradesh

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని డిమాండ్లను తక్షణం ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ కొనసాగుతుంది. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో జనజీవనం స్థంభించింది. అధికార పార్టీ టీడీపీ మినహా ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించడంతో.. బంద్ సంఫూర్ణంగా కొనసాగుతుంది. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేశారు. రాష్ట్రంలోని పలు విద్యార్థులకు జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు.

బంద్ ను పురస్కరించుకుని ఇవాళ ఉదయమే ప్రతిపక్షాల నేతలు బస్ డిఫోలకు వెళ్లి బస్సులను అడ్డుకున్నారు.  ఢిపోల ఎదుట ధర్నాలు చేపట్టడంతో రాష్ట్రంలో రమారమి బస్సులన్నీ ఢిపోలకే పరిమితమయ్యాయి,  ఇక కొంతసేపటికి రోడ్డెక్కిన పలు బస్సులను అందోళనకారులు అడ్డుకున్నారు. పలు చోట్ల వాహనాలను కూడా దహనం చేశారు. దీంతో బస్సులన్ని ఎక్కడవి అక్కేడ నిలిచిపోయాయి. ఇక జనజీవనం పూర్తిగా స్థంభించింది.

శ్రీకాకుళం, విజయనగరం, కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు.  శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి.

బంద్ లతో రాష్ట్రానికే నష్టం అధికమని భావించిన అధికార పక్ష టీడీపీ.. మన ప్రజలకు మనమే ఇబ్బంది సృష్టిస్తున్నామన్న భావనతో బంద్‌కు దూరంగా ఉంది. అయితే బంద్ కు మద్దతు పలకని టీడీపీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలన ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్ కు మాత్రం తాము మద్దతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో ఆందోళన చేపడితే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. బంద్ ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles