Pawan Kalyan remembers Ambedkar through quotes బాబా సాహెబ్ కు జనసేనాని పవన్ అంజలి..

Pawan kalyan pays tribute to ambedkar on his birth anniversary

Jana sena, Pawan Kalyan, ambedkar jayanti, tributes, Dr. BR Ambedkar, mentally retarded T20 Cricket, LB stadium, Hyderabad

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan pays tributes to Dr. BR Ambedkar and remembers him throgh his Quotes.. “Cultivation of Mind should be the ultimate aim of human existence“.

బాబా సాహెబ్ కు జనసేనాని పవన్ అంజలి.. దివ్యాంగుల క్రికెట్లో బిజీ..

Posted: 04/14/2018 10:43 AM IST
Pawan kalyan pays tribute to ambedkar on his birth anniversary

రాజ్యాంగ నిర్మాత డాక్డర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఆయనకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ నిర్మాత సేవలను శ్లాఘించారు. అంబేద్కర్ భారతీయుడిగా జన్మించడం భారత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కోన్నారు. ఆయన దూరదృష్టితో భారతదేశంలో తరతరాల తరువాత రానున్న మార్పులను కూడా బేరిజు వేసుకుని రాజ్యాంగాన్ని రచించారని పవన్ కొనియాడారు.

ఆయన ట్విట్టర్ సందేశం సాగిందిలా..  'రాజ్యాంగ పితామహుడు బీఆర్‌ అంబేద్కర్‌ భారతీయుడిగా జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం. దూరదృష్టితో మన రాజ్యాంగానికి రూపకల్పన చేయడంతో పాటు దేశంలో విద్యా వ్యాప్తికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. ఆయన జయంతి సందర్భంగా నా తరఫున, పార్టీ తరఫున తయనకు వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో గడుపుతానని, అనంతరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న దివ్యాంగుల క్రికెట్ పోటీలకు హాజరు అవుతానని ముందుగానే పర్కోన్న పవన్ కల్యాణ్.. అన్న పాట ప్రకారం ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి దివ్యాంగుల టీ20 క్రికెట్ టోర్నమెంటు వేడుకకు హాజరయ్యారు. ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం టోర్నీ ప్రారంభమైంది.

తొలి మ్యాచ్ తెలంగాణ, వడోదర జట్ల మధ్య జరగబోతోంది. జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ రెండోసారి జరుగుతోంది. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి జట్లు హాజరయ్యాయి. టోర్నీ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ ను చూసి భారీ ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా స్టేడియంలో సీఎం, సీఎం అంటూ నినాదాలు కూడా వినిపించాయి. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగ క్రికెటర్లతో పవన్ కల్యాణ్‌ని కలిసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles