tv debate leads to police complaints on channel పోలీసు ఫిర్యాదులకు దారి తీసిన కాస్టింగ్ కౌచ్ చర్చ

Tv debate leads to police complaints on channel and opponents

tollywood casting couch, sri reddy, madhavi, jubliehills police, protest at TV channel, defamation, Raga shruthi, sunitha, Tv debate, sensational news, movies, entertainment

A TV channel which conducted a debate on tollywood casting couch leads to police complaints on channel and the opponents in the debate alleging they did not allow her to speak and defamed her.

పోలీసు ఫిర్యాదులకు దారి తీసిన కాస్టింగ్ కౌచ్ చర్చ

Posted: 04/14/2018 11:24 AM IST
Tv debate leads to police complaints on channel and opponents

మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు అత్యంత దారుణ ఘటనపై అందరూ స్పందిస్తారనడానికి ఒక నిర్భయ, ఒక ఉన్నాబ్, ఒక ఖాతూర్ ఘటనలు నిదర్శనం. అయితే జరిగిన తరువాత స్పందించడం కంటే ఆలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు తాము అండగా వున్నామని సగటు పౌరుడు అండగా నిలబడితే.. అదే వారి జీవితాన్ని ప్రసాదిస్తుంది. అయతే కాలంకన్నా వేగంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్న మనిషి ఎవరు ఎటుపోతే నాకేంటి అంటూ తన పరుగును మాత్రం అపకపోవడమే అఘాయిత్యాలకు కారణమవుతుంది.

ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య కూడా సెద్ద సామాజిక రుగ్మతగా ఇప్పడిప్పుడే బయటపడుతుంది. దీనిని రూపుమాపడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని అన్న అంశమై ఓ టీవీ ఛానెల్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులతో చర్చావేదిక నిర్వహించారు. అయితే ఈ చర్చతో మంచి జరుగుతుందని భావిస్తే అది కాస్తా అటు టీవీ ఛానెల్ మెడకు చుట్టుకుంది. చర్చా వేదికల్లో అనుభవరాహిత్యాన్ని.. సమస్యలను పక్కదారి పట్టింటి.. వ్యక్తిగత దూషణలు, పరస్పర అరోపణలు, విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో.. అసలు అంశం పక్కదారి పడుతుంది.

ఇలానే జరిగిన ఓ టీవీ చానెల్ చర్చలో.. ఛానెల్‌ సహా ముగ్గురు సహనటులపై మరో సహనటి ఏకంగా పోలీసులకు పిర్యాదు చేసింది. టాలీవుడ్ లో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై చర్చాకార్యక్రమం నిర్వహిస్తున్నామని తనను చర్చావేదికకు అహ్వానించారని, అయతే వారి పిలుపు వేరకు వెళ్లిన తనను కించపరిచారని, ఆ చర్చా వేదికలో తనకు అవకాశం కల్పించలేదని టీవీ ఛానెల్ పై ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఒక సినీ నటి ఫిర్యాదు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని ఒక టీవీ ఛానెల్ సినీ పరిశ్రమలో నెలకొన్న చింది.

ఇందులో రాఘశృతి, సునీత అనే ఆర్టిస్టులు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. రాఘశృతిది కూడా తన ఊరు కావడంతో ఆమెతో స్నేహం చేశానని, కొన్నాళ్లయ్యాక సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ, ఆమె తనతో చెడు పనులు చేయించేందుకు ప్రయత్నించిందంటూ సునీత ఆరోపించారు. అంతకుముందు ఆమె ఆ టీవీ ఛానెల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి, ఛానెల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఛానెల్ ఫిర్యాదుతో, పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో సునీత... రాఘశృతి, ఛానెల్ పై ఫిర్యాదు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles