apscs sadhana samiti call for state bandh on 16th రాష్ట్ర బంద్ కు ప్రత్యేక సాధన సమితి పిలుపు.. కాంగ్రెస్ మద్దతు..

Apscs sadhana samiti call for state bandh on 16th

andhra pradesh bandh, ap special status sadhana samiti, andhra pradesh bandh, chalasani srinivas, ap special status, union government, congress, TDP, politics

andhra pradesh special status sadhana samiti calls for state bandh on april 16th. chalasani srinivas speaking to media said that bandh is called to bring pressure on centre.

రాష్ట్ర బంద్ కు ప్రత్యేక సాధన సమితి పిలుపు.. కాంగ్రెస్ మద్దతు..

Posted: 04/12/2018 05:56 PM IST
Apscs sadhana samiti call for state bandh on 16th

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కాంక్షను కేంద్రానికి తెలియజేసేలా రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ గళాన్ని వినిపిస్తున్నా.. కేంద్రం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. మోడీ ప్రభుత్వంపై మరింత ఒత్తడిని తీసుకువచ్చేందుకు అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి.. ఈ నెల 16న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమకు రోడ్లపైకి రావాలని లేదని, శాంతియుతంగానే నిరసనలు తెలపాలని వున్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమను రోడ్డపైకి వచ్చేలా ఉసిగొల్పుతుందని అన్నారు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఆటంకాలు కలగడంతో మనస్తాపం చెందినట్లు ప్రకటించుకున్న ప్రధాని మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని అన్నారు. ఈ నెల 16న నిర్వహించనున్న బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని చెప్పారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

ప్రత్యేక హోదా సాధన సమితి బంద్‌కు వైసీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ బంద్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్నట్లు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్రకటించారు. కాగా, అధికార తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం బంద్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఈ అంశంపై ఓ కార్యక్రమంలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బంద్ లతో రాష్ట్రానికే అన్యాయం జరుగుతుందని, ధీని ప్రభావం పూర్తిగా రాష్ట్రంపైనే వుంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles