actress Sri Reddy prompts NHRC notices to TS, I&B Ministry శ్రీరెడ్డి ఘటనపై స్పందించిన ఎన్.హెఛ్.ఆర్.సీ.. నోటీసులు జారీ..

Actress sri reddy prompts nhrc notices to ts i b ministry

sri reddy, sri reddy strips, sri reddy protest, sri reddy casting couch, sri reddy first victory, sri reddy NHRC, sri reddy maa, sri reddy telangana cs, sri reddy telangana information and publicity secretary, sri reddy nhrc notices, sri reddy maa, sri reddy fundamental rights, tollywood, entertainment

NHRC quoted media reports and said the actress had questioned the State government and the Movie Artistes Association (MAA) on the absence of the Committee Against Sexual Harassment (CASH).

శ్రీరెడ్డి ఘటనపై స్పందించిన ఎన్.హెఛ్.ఆర్.సీ.. నోటీసులు జారీ..

Posted: 04/12/2018 05:00 PM IST
Actress sri reddy prompts nhrc notices to ts i b ministry

తెలుగు ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని.. తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వకుండా , వాడుకుని వదిలేస్తున్నారని గత నెల రోజులుగా పోరాటం చేయడంతో పాటు పలు లీకులను విడుదల చేస్తూ కొందిరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నటి శ్రీ రెడ్డి.. అంశం ఇక ఒక కొలిక్కి వచ్చింది. శ్రీరెడ్డి ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించి.. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో వెంటనే స్పందించాలంటూ పలువురికి నోటీసులు కూడా జారీ చేసింది.

సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ ఓ నిర్మాత కుమారుడు (అభిరామ్) లైంగికంగా వేధించటాన్ని జాతీయ మానవహక్కుల కమీషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై స్వతహాగా స్పందించిన మానవహక్కుల కమీషన్.. ఈ పూర్తి వ్యవహారంపై తమకు వెంటనే సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సమాచార, ప్రసార శాఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లోగా బుదులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, సమాచార, ప్రసార శాఖ సెక్రటరీలను ఆదేశించింది.

శ్రీరెడ్డి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా.. అమెతో నటిస్తే.. వారిపై నిషేధం విధిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్రంగా స్పందించింది. పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు  చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశ్నించింది NHRC. లైంగిక వేధింపులు ఎదురైన పక్షంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి చర్య తీసుకున్నారు అన్న అంశాలపై సరైన యంత్రాంగం లేకపోవడాన్ని ఎన్.హెచ్.ఆర్.సి తప్పుబట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles