Both Houses adjourned for the day అన్నాడీఎంకే ఎంపీల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా..

Both houses adjourned for the day amid protests by aiadmk mps

Lok Sabha, Government of India, Parliament of India, Mahajan, Motion of no confidence, Adjournment, Speaker of the Lok Sabha, Sumitra Mahajan, Cauvery river, Ananth Kumar, Congress, AIADMK, Speaker, Mallikarjun Kharge, congress, bjp, TDP, YCP, politics

Proceedings in Rajya Sabha and Lok Sabha were disrupted yet again on Monday as Parliament entered the last week of Budget Session. As soon as the RajyaSabha convened Chairman Venkaiah Naidu adjourned it for the day following protests by the AIADMK legislators, the lok sabha was first adjourned for an hour and then for the day.

అన్నాడీఎంకే ఎంపీల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా..

Posted: 04/02/2018 12:55 PM IST
Both houses adjourned for the day amid protests by aiadmk mps

పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు చివరి వారానికి చేరుకున్న నేపథ్యంలోనూ ఎలాంటి మార్పు లేకుండా ఉభయ సభలు మంగళవారినికి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు పార్లమెంటు ఉభయసభలు కొనసాగుతాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ వారాంతపు సెలవుల అనంతరం ప్రారంభమైన పార్లమెంటు ఉబయసభల్లో ఇవాళ కూడా సభాకార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ వెంకయ్యనాయుడు అందోళనకారులను తమ స్థానాల్లో కూర్చోవాలని పదే పదే విన్నవించినా వారు లక్ష్యపెట్టకపోవడం.. సభలో నినాదాలు ఇవ్వడంతో ఆయన సభను రేపటి వాయిదా వేశారు.

ఇక ఇటు లోక్ సభలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మాణాలను ఇచ్చినా..  వాటిపై ఎలాంటి చర్చ లేకుండా మరోమారు వరుసగా తొమ్మిదవ పర్యాయం లోక్ సభ వాయిదా పడింది. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు.. ఇటు అంధ్రప్రదేశ్ కు చెందిన అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణంపై  తొమ్మిదవ రోజు కూడా షరామామూలుగానే వాయిదా పడింది. రోజూ సాగే తంతుమాదిరిగానే లోక్ సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు అందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తరువాత 12 గంటలకు తిరిగి ప్రారంభమైన సభలో కూడా మార్పు లేకపోవడంతో సభ ఏప్రిల్ 3 మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్.

ఈ క్రమంలో రెండో పర్యాయం ప్రారంభమైన లోక్ సభలో తమకు పలు పార్టీల నుంచి అవిశ్వాస తీర్మాణాలు అందాయని సభలో ప్రకటించిన స్పీకర్ సుమిత్రా మహాజన్.. వాటిపై చర్చించాలని.. అందుకు సభ్యులందరూ తమ స్థానాల్లో అసీనులు కావాలని అప్పుడే తాను అవిశ్వాససభ్యుల సంఖ్యను లెక్కించగలుగుతానని చెప్పారు. అయితే కావేరి నది జలాల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తూ.. వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేయడంతో.. అమె సభను వాయిదా వేశారు.

అంతకుముందు బీజేపి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ జోక్యం చేసుకుని తమ ప్రభుత్వం అవిశ్వాసంపై సిద్దంగా వుందని అన్నారు. అయితే సభలో విపక్షంగా వున్న కాంగ్రెస్ కావాలని 70 ఏళ్లుగా అధికారంలో వుండి.. తప్పుడు విధానాలతో సభను అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వంపై పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా వుందని, నరేంద్రమోడీకి సభలోనూ, సభ భయట దేశంలోనూ ప్రజల మద్దతు వుందని చెప్పారు. ఆ తరువాత కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే మాట్లాడుతూ.. తమ అవిశ్వాస తీర్మాణాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్దమేనంటూ ప్రకటిస్తూనే.. సభనుంచి పారిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles