Parliament logjam adjourns both Houses for the third day అవిశ్వాసంపై మూడో రోజు సేమ్ సీన్.. ఉభయసభలు వాయిదా

Lok sabha rajya sabha adjourned no trust motions disallowed again

TDP, YSRCP, no confidence motion, council of minister, prime minister, PM Modi, Union Govenment, Andhra pradesh, special status, congress, trinamul congress, left parties, national congress party, biju janatadal, andhra pradesh special status, TRS, AiADMK, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, andhra pradesh, politics

The Lok Sabha proceedings were disrupted by the TRS, AIADMK party for the third day on Tuesday. Lok Sabha Speaker Sumitra Mahajan disallowed for the third time no-confidence motions against the government, citing a disorderly House.

అవిశ్వాసంపై ఉభయసభల్లో అదే సీన్.. రేపటికి వాయిదా

Posted: 03/20/2018 12:56 PM IST
Lok sabha rajya sabha adjourned no trust motions disallowed again

అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని.. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై వరుసగా మూడో రోజు కూడా ఉభయసభల్లో వాయిదా పర్వాలే నడిచాయి. కేంద్రప్రభుత్వం తమ అనుకూల పార్టీలతో పార్లమెంటులో ఈ డ్రామాకు తెరలేపుతుందన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీలు తమ అవిశ్వాస తీర్మాణం చర్చకు వస్తుందని అశలు ఇక కనిపించకపోవడంతో వెల్ లోకి వెళ్లి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవాళ కూడా అన్నాడిఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు లోక్ సభలో ప్రారంభం కాగానే అందోళన చేపట్టడంతో స్పీకర్ మరు నిమిషంలోనే సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత ప్రారంభమైన సభలో ఏ మాత్రం మార్పు రాలేదు. కేంద్ర విదేశాంగ శాఖ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దేశం దిగ్ర్భాంత్రి చెందే ఒక ప్రకటనను పార్లమెంటులోని సభ్యులకు చెప్పాలని వచ్చినా.. సభ్యులు అందోళన నేపథ్యంలో అమె చెప్పలేక పోయారు.

ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. అందోళన చేస్తున్న సభ్యులను మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ది్గ్ర్బాంతికర అంశం కూడా మీకు పట్టదా అని ప్రశ్నించారు. తోటి భారతీయులపై మీకున్న ప్రేమ ఇదేనా.. వారికి సంబంధించిన అంశంపై మీకు స్పందన లేదా అని ప్రశ్నించారు.? అయినా సభ్యులు తమ అందోళనను విరమించలేదు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు స్పీకర్. ఇక అటు రాజ్యసభలో కూడా అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సభలో సభ్యులు నినదించారు. దీంతో అక్కడ కూడా గంధరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  no confidence motion  TRS  AiADMK  BJP  PM Modi  sushma swaraj  Andhra pradesh special status  

Other Articles