Bodies of 39 Indians, abducted by ISIS in Iraq, found: Swaraj ఇరాక్ లో 39 మంది భారతీయుల హత్య: సుష్మా

39 indian hostages held by isis in iraq have been killed sushma swaraj

Sushma Swaraj, Islamic State hostage in Iraq, ISIS Indian hostages, ISIS Indian captives, Indians hostage by ISIS, Indian hostages in Iraq, TDP, YSRCP, no confidence motion, TRS, AiADMK, BJP, lok sabha, rajya sabha, Union Govenment, Andhra pradesh, special status, congress, andhra pradesh, politics

The 39 Indian citizens kidnapped in 2014 by ISIS in Iraq were killed, confirmed external affairs minister Sushma Swaraj today. The minister said in the Rajya Sabha that a deep penetration radar has confirmed the death of the hostages who had been taken from Mosul.

ఇరాక్ లో 39 మంది భారతీయుల హత్య: సుష్మా

Posted: 03/20/2018 01:01 PM IST
39 indian hostages held by isis in iraq have been killed sushma swaraj

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇవాళ రాజ్యసభలో అత్యంత దిగ్ర్ర్బాంతికర వార్తను ప్రకటించారు. దేశస్తులను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హతమార్చిన వార్తను దేశ పార్లమెంటులో ద్వారా యావత్ దేశానికి వెల్లడించేందుకు అమె వచ్చినా.. లోక్ సభలో సభ్యుల నిరసనల మధ్య అది సాధ్యం కాలేదు. దీంతో రాజ్యసభలోకి ఈ ప్రకటన చేశారు సుష్మాస్వరాజ్. దేశానికి చెందిన 39 మందిని అత్యంత కర్కషంగా ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చారని విషాదకర వార్తను చెప్పారు.

వీరందరినీ 2014లో ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని పలు ప్రాంతాల నుంచి కిడ్నాప్ చేశారని, వారిని గుర్తించేందుకు తామెంతో కృషి చేసి, విఫలమయ్యామని తెలిపారు. భారతీయులందరినీ హతమార్చి మొసూల్ లో పూడ్చి పెట్టారని అమె తెలిపారు. ఈ ప్రాంతాన్ని రాడార్ల సాయంతో కనుగొన్నామని, మృతదేహాలను బయటకు తీయగా, పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయని, మృతదేహాలను బాగ్దాద్ కు తీసుకెళ్లి డీఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించగా, 70 శాతం మ్యాచ్ అయ్యాయని అన్నారు.

ఆ అవశేషాలను ఇండియాకు తెచ్చేందుకు జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో అవశేషాలను తీసుకు వస్తామని అన్నారు. ఆపై అవశేషాలను అమృత్ సర్, పట్నా, కోల్ కతా ప్రాంతాల్లోని వారి కుటుంబీకులకు అందిస్తామని తెలిపారు. కాగా, వీరంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని ఇన్నాళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో సుష్మా స్వరాజ్ ప్రకటన ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఆపై రాజ్యసభలో మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని సభ మౌనం పాటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Islamic State terrorists  hostage in Iraq  ISIS Indian hostages  captives  ISIS  Iraq  

Other Articles