28 Congress MLA suspended, re-admitted 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ రికాల్..

Gujarat mlas suspended congress walks out of assembly

Gujarat assembly, Congress walkout, senior party member Virji Thumar, gujarat assembly, gujarat speaker, Rajendra Trivedi, Congress MLAs suspended, gujarat assembly, congress mlas suspended, r c faldu, rajendra trivedi, gujarat news

As many as 28 Congress MLAs were suspended from the Gujarat assembly for a day and 15 of them evicted from the house after they created a ruckus over the suspension of senior party member Virji Thumar.

తెలంగాణలోనే కాదు గుజరాత్ లోనూ కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్.. రీకాల్..

Posted: 03/14/2018 10:29 AM IST
Gujarat mlas suspended congress walks out of assembly

ఇటు తెలంగాణ అసెంబ్లీలోనే కాదు ఏకంగా ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ లోనూ కాంగ్రెస్ శాసనసభ్యులను సస్పెండ్ చేశారు. ఈ రెండు కాకతీళీయంగానే జరిగినా.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ లోపాయికారి ఒప్పందంతోనే ఈ సస్పెన్షన్లకు తెరతీసాయన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.

అటు గుజరాత్ లో మాత్రం రమారమి అధికార బీజేపికి కేవలం 15 స్థానాలు మాత్రమే తక్కువున్న కాంగ్రెస్ నుంచి 28 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలతో మిగిలిన కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ విప్ అమిత్ చవ్దా కల్పించుకుని సభ్యుల ప్రవర్తనకు తాను పార్టీ తరపున క్షమాపణలు కొరుతున్నానని చెప్పడంతో సభ రెండో అర్ధ భాగంలో సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడానికి పార్టీ సీనియర్ నేత విజ్రి తుమార్‌ బల్ల ఎక్కి నిరసన తెలియజేయడమే కారణంగా స్పీకర్ రాజేంద్ర త్రివేదీ  ప్రకటించారు. దీంతో విజ్రి తూమర్ తో పాటు సభలో అందోళన చేస్తున్న 28 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు దారితీసిన పరిణామాలు ఇలా వున్నాయి. గత 22 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం గురించి అలోచించలేదని.. రైతులపై బీజేపికి వున్నదంతా కేవలం కపట ప్రేమ, మొసలి కన్నీరని దుయ్యబట్టారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ వుండివుంటే గత 22 ఏళ్లుగా ఒక్క డ్యామ్‌ కూడా ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై స్పందించిన వ్యవసాయశాఖా మంత్రి ఆర్సీ ఫాల్దు..తమ హయాంలో గత రెండు దశాబ్దాలుగా ప్రారంభించిన పలు సాగునీటి  పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా తుమార్ పేరును ప్రస్తావించడం గందరగోళానికి దారితీసింది. తుమార్ తన బెంచీపైకి ఎక్కి మంత్రితో వాగ్వాదానికి దిగారు.

కాగా విజ్రీ తూమర్ ను బెంచ్ దిగాలని స్పీకర్ రాజేంద్ర త్రివేది పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ అదేశాలను పెడచెవిన పెట్టిన ఎమ్మెల్యే.. సభలో తన పేరును ప్రస్తావించిన మంత్రిపై మండిపడ్డారు. ఏకంగా మంత్రి పాల్దును దూషించారు. ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాలు విసరడంతో.. అగ్రహించిన స్పీకర్ తూమర్ తో పాటుగా అతనికి మద్దుగా నిరసనలు చేసిన ఎమ్మెల్యేలతో పాటు వెల్ లోకి దసూకోచ్చిన విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ చీఫ్ విప్ చవ్దా క్షమాపణలు కొరడంతో మధ్యాహ్నం నుంచి సస్పెన్షన్ తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles