teacher turns godsman, cheats devotees caught బాబా అవతారమెత్తాడు.. బురిడీ కొట్టించాడు..

Self proclaimed baba attempts suicide over row

government teacher, sudhakar, selfstyled godsman, prashanth nagar, devotees, nellore, crime,

A Government teacher who turned into self styled godsman collected RS 10 crore from devotees and attempted suicide after caught.

బురిడీ కొట్టించాల్సిన బాబా.. అడ్డంగా బుక్కయ్యాడు..

Posted: 02/17/2018 08:38 AM IST
Self proclaimed baba attempts suicide over row

చెడపకురా చెడేవు అన్న నానుడి అనేక సందర్భాల్లో వింటుంటాం. లేదంటే ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నది కూడా ఒక్కసారైనా ఎదుర్కోని వుంటాం. సరిగ్గా నెల్లూరులోని మహారాజ్ బాబా విషయంలోనూ అదే జరిగింది. ఓవర్ నైట్ లో సంపన్నులు కావాలన్న కలలు అతన్ని వేంటాడాయి. అంతే ఇక భక్తుల మూఢవిశ్వాసాలనే పెట్టుబడిగా మరల్చి.. తనకు తానుగా మహారాజ్ బాబాగా నామకరణం చేసుకున్నాడు సుధాకర్ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

అయితే తన వద్ద మహిమలు వున్నాయని కాకతాళీయంగా తమ కోర్కెలో, లేక ఇబ్బందులో లేక సమస్యలు తీరిన భక్తుల నమ్మకంతో బాబా వ్యాపారం సజావుగానే సాగింది. యన పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారు మోగి పోయింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆయన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవారు. దీంతో సుధాకర్‌కు మరింత దుర్భుద్ధి పుట్టింది.

103 రోజులు హోమం చేస్తే మంచి జరుగుతుందన్న పేరుతో భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మనీ స‌ర్క్యులేష‌న్‌ స్కీమ్ మాదిరిగా డబ్బులు వసూలు చేశాడు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. భక్తులు ఇచ్చిన డబ్బును బస్తాల్లో వేసిన సుధాకర్ ఇటీవల అర్ధరాత్రి ఓ చోటుకి తరలించాలని చూశాడు. ఇంతవరకు సజావుగా సాగిన ఆయన ప్లాన్ ఇక్కడే బెడిసి కొట్టింది.

తాడి తన్నేవాడుంటే.. తల దన్నేవాడు ఉంటాడాన్నట్లు తాను భక్తులకు బురిడీ కోట్టిస్తే.. సుధాకర్ ను ఆయన వద్ద పనిచేసే నలుగురు సిబ్బంది బురిడీ కొట్టించారు. ఆ డబ్బంతా తీసుకుని పారిపోయారు. అంతే నలుగురు సిబ్బంది బురిడీ కొట్టించడంతో దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిన బాబా దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆయన ఆశ్రమం వద్దకు భారీగా తరలివచ్చి అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government teacher  sudhakar  selfstyled godsman  prashanth nagar  devotees  nellore  crime  

Other Articles