7.2 magnitude earthquake rocks Mexico మెక్సికోను వణికించిన భూకంపం.. 7.5 తీవ్రత

Magnitude 7 5 quake hits mexico buildings sway in capital

earthquakes, Mexico, Oaxaca state’s capital, Mexico City’s central, Sept. 19 earthquake, Reforma Avenue, natural disasters

A powerful magnitude-7.2 earthquake shook south and central Mexico, causing people to flee swaying buildings and office towers in the country’s capital, where residents were still jittery after a deadly quake five months ago.

మెక్సికోను వణికించిన భూకంపం.. 7.5 తీవ్రత

Posted: 02/17/2018 09:20 AM IST
Magnitude 7 5 quake hits mexico buildings sway in capital

మెక్సికో దేశంలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రెక్టార్ స్కేలుపై 7.5గా నమోదయ్యింది. భూ ప్రకంపనల ధాటికి దక్షిణ, సెంట్రెల్ మెక్సికో ప్రాంతాలు వణికిపోయాయి. భవనాలు ఊయల మాదిరిగా ఊగాయి. భవనాల ఎదుట ప్కార్ చేసిన కార్లు వాటంతటవే అటుఇటు తిరిగాయి, దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మెక్సికో దేశంలోని ఓక్సాక రాష్ట్రం పరిధిలోని నసియోనల్ నగరంలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే కడపటి వార్తలు అందేవరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

కాగా, అస్తినష్టం ఎంత జరిగిందన్న విషయాలను అధికారులు అంచనా వేస్తున్నారు. అరు మాసాలు తిరగకుండానే మరోమారు భూప్రకంపనలు తమ ప్రాంతాలను సంభవించడంతో అక్కడి వారు భయాందోళనకు గురై ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. గత ఏడాది సెప్టెంబర్ 19న సంభవించిన భూకంపం.. ఏకంగా 229 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన ఇంకా అక్కడి వారి కళ్లెదుటే కదలాడుతున్న క్రమంలో మరోమారు భూమి కంపించడంతో వారు హతాశులయ్యారు.

మెక్సికోకు 200 మైళ్ల దూరంలో దక్షిణ పసిఫిక్ తీరంలో ఈ భూకంపం సంభవించింది. ఓక్సాకా రాష్ట్రంలోని పినోటేపా నసియోనల్ పట్టణం సమీపంలో ఇది సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. సునామీ వచ్చే అవకాశాలు లేవని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. కాగా, భూకంపం ధాటికి పలువురు క్షతగాత్రులయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు క్షతగాత్రులను అస్పత్రికి తరలించి.. యుద్దపాత్రిపదికన సహాయచర్యలు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles