Register for voter ID, update online from June ఓటరుగా నమోదు త్వరలో సులభతరం..

Register for voter id update online from june

voter id, Election Commission, OP Rawat, electoral officers, EROnet, smart phones, electoral rolls, app, one time password, CEC

By June this year, voters will be able to add their names to the electoral rolls through an app while sitting at home.

ఓటరుగా నమోదు సులభతరం.. మీ స్మార్ట్ ఫోన్ నుంచే..

Posted: 02/15/2018 06:38 PM IST
Register for voter id update online from june

ఓటర్ గా నమోదు చేసుకోవడం 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరి హక్కు. ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతీ ఎన్నికలలో ఓటు వేయడం ప్రతీ ఓటరు బాధ్యత. దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా.. ఫలితాలు మాత్రం ఓటింగ్ శాతంపైనే అధారపడతాయన్నది కాదనలేని వాస్తవం. ఓటింగ్ శాతంతో సరళి అర్థమవుతుందన్నది కూడా కాదనలేని వాస్తవం. అయితే ఏ ఎన్నికలలో కూడా ఇప్పటి వరకు నూటికి నూరు శాతం ఓటింగ్ మాత్రం నమోదు కాలేదు. అందుకు కారణాలు అనేకం. అయితే తమ పక్క నుంచి కూడా ఇలాంటి కొన్ని అవరోధాలు వున్నాయని తెలుసుకున్న ఎన్నికల సంఘం.. వాటిని త్వరలోనే సవరించనుంది.

అసులు ఎక్కడ తాము ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్న అంశంలో ఏర్పడిన సందేహాలు.. ఇలా చేసినా తుది జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడం.. ఇలా అనేకాంశలు 100 పర్సెంట్ ఓటింగ్ శాతానికి అవరోధంగా మారాయి. ఇక ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు మీకు దూరం చేయనుంది భారత ఎన్నికల కమీషన్. ఇకపై ఓటరుగా నమోదు, అడ్రస్ మార్పు. లేక సవరణలు ఇత్యాదులు ఏం చేయాలన్న ఇంట్లో కూర్చొనే చేసుకునే వెసలుబాటును కల్పించనుంది. ఇందుకోసం ఎక్కడెక్కడ తిరగాలి, ఏయే కార్యాలయాలకు ప్రదిక్షణ చేయాలన్న సందేహాలు కూడా వద్దు.

మీ ఇంట్లోనే, కుర్చీలో కూర్చోనే ఇక ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదెలా అన్ లైన్ లోనేగా మాకు తెలుసు అంటున్నారా..? అదేంకాదండీ బాబు.. నిత్యం మీ చేతుల్లో వుండే స్మార్ ఫోన్ తో. అదెలా అంటే.. స్మార్ట్ ఫోన్లో యాప్ నుంచే పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందొచ్చు. అంతేకాదు ఓటర్ తన నివాస చిరునామా వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలను అదే యాప్ నుంచి ఎవరికి వారే చేసుకోవచ్చు. ఎలక్షన్ కార్యాలయం వరకూ వెళ్లాల్సిన శ్రమ ఉండదు. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ERONET పేరుతో యాప్ ను అభివృద్ధి చేసింది.

ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు ఈ అప్లికేషన్ లో భాగమయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ తెలిపారు. గుజరాత్, హిమాచల్ సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయలేదన్నారు. జూన్ నాటికి మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ లో భాగమవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. ఓటర్లు తమ మొబైల్ కు వచ్చే ఓటీపీ సాయంతో తమ ఓటరు ఐడీ వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని రావత్ చెప్పారు. కొత్త చిరునామాను ఎంటర్ చేసిన తర్వాత అంతకుముందున్న చిరునామా అందులో డిలీట్ అవుతుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles