Pawan Announces JAC with Undavalli, JP నవ్యాంధ్ర ప్రత్యేక హోదా కోసం జేఏసీ

Janasena to form a jac to fight for ap special status with undavalli jp

Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JAC, Pawan Kalyan Press meet, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star Pawan Kalyan called for forming a JAC on the lines of Telangana Agitation Times. He also called for experts like Undavalli Arun Kumar and Jaya Prakash Narayan to be included in that JAC to study and reveal the facts.

ITEMVIDEOS: ప్రత్యేక హోదా కోసం ఉండవల్లి, జేపీలతో జేఏసీ

Posted: 02/07/2018 06:35 PM IST
Janasena to form a jac to fight for ap special status with undavalli jp

రాష్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరముందని జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఉండవల్లి అరున్ కుమార్, జయప్రకాష్ నారాయణ వంటి అనుభవజ్ఞులైన రాజకీయ నేతలతో పాటు అనంతపురం, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సీపీఐలోని కొందరు నాయకులు మరికొందరితో కూడా జేఏసీ ఏర్పాటు చేయాలని యోచనలో వున్నట్లు చెప్పారు. తాను ప్రజల పక్షం తప్పా పార్టీల పక్షం కాదని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు కేవలం తన గొంతు మాత్రమే సరిపోవడం లేదని పవన్ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి తమ డిమాండ్ ను సాధించుకునేందుకు మరింత బలం కూడగట్టుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్‌సభను స్తంభింపజేశారని అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించానని తెలిపారు. మాజీ మంత్రి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లాంటి వారిని క‌లుపుకుని ముందుకు వెళతానని చెప్పారు.

ఇందుకోసం తాను స్వయంగా ఉండ‌వ‌ల్లి, జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అశించినంతమేర నిధుల కేటాయింపులు జరపని కారణంగా వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు తాను వ్యతిరేకం కాదని పవన్ అన్నారు. కాకపోతే శాంతియుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు. బంద్ ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వాలు చట్టంలో ఉంచిన అంశాలను కూడా చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని పెట్టిందని దానిని అమలు చేయమనే జేఏసీ అధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles