schools, colleges, busses shut in APప్రశాంతంగా కొనసాగుతున్న బంద్.. రోడ్లపై కబడ్డీ ఆటతో నిరసన

Bandh shutdown andhra pradesh peaceful protest

andhra pradesh, andhra pradesh bandh live updates, andhra pradesh bandh, andhra bandh today, visakhapatnam bandh, andhra pradesh bandh today, vishakapatnam bandh live updates, budget protests, left parties protest, bandh, left parties, vijayawada, visakhapatnam, andhra university, transport, union budget, andhra pradesh

Alleging that huge sums were given to other states because of the upcoming polls, the parties slammed the Centre for the "injustice" meted out to Andhra Pradesh.

ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్.. రోడ్లపై కబడ్డీ ఆటతో నిరసన

Posted: 02/08/2018 09:23 AM IST
Bandh shutdown andhra pradesh peaceful protest

నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జరగలేదని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుకు రాష్ట్ర ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగడంతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రమారమి అన్ని పార్టీలు బంద్ కు మద్దతునిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనజీవనం స్థంభించింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

ఉదయాన్నే వామపక్ష నేతలు ఢిపోల వద్దకు చేరుకుని ధర్నాలు చేయడంతో బస్సులన్నీ డిఫోలకే పరిమితం అయ్యాయి. ఇక పలు ఢిపోల్లో అర్టీసీ డ్రైవర్లు కూడా బంద్ కు మద్దతు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై వామపక్ష నేతలతో పాటు యువకులు కబడ్డీ అడుతూ నిరసన తెలిపడంతో ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్థంభించింది. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు ముందుగానే యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. అంద్రరాష్ట్ర ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన అంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.

రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్‌ వంటి అంశాల ప్రస్తావన ఏదీ బడ్జెట్టులో లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంను బహిరంగ లేఖ ద్వారా సీపీఐ కోరింది. అయితే బంద్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, బంద్ ను విరమించుకోవాలని సీఎం వామపక్ష పార్టీలకు సూచించగా, వామపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. కాగా కాంగ్రెస్, సహా వైఎస్సార్ సీపీ పార్టీలు కూడా బంద్ కు సంఘీభావం తెలుపాయి.

 కాగా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తాము కేవలం నిరసనలు మాత్రం తెలుపుతామని టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్ కు మద్దతు తెలపాలని వామపక్ష పార్టీలు ఇతరపార్టీలను కోరగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా తదితర పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ను పురస్కరించుకుని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. అయితే ప్రభుత్వ సంస్థలు యథావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నప్పటికీ, వాటిని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandh  left parties  vijayawada  visakhapatnam  andhra university  transport  union budget  andhra pradesh  

Other Articles