Change records after car sale or pay for mishaps: SC వాహనాలు విక్రయించిన వెంటనే ట్రాన్స్ ఫర్ తప్పనిసరి.. లేదా..!

Change records after car sale or pay for mishaps sc

Supreme Court of India, car accidents, Supreme Court, Motor Accidents Claims Tribunal, Haryana High Court, Accidents, supreme court, vehicles, mvi act, records transfers, accidents, road mishap, delhi

If you sold your car and did not bother to change the ownership in registration records, you would be liable for compensation claims arising from accidents.

కారు అమ్మిన వెంటనే ట్రాన్స్ ఫర్ తప్పనిసరి.. లేదా..!

Posted: 02/07/2018 03:34 PM IST
Change records after car sale or pay for mishaps sc

కారు విక్రయించిన వెంటనే కొన్న వ్యక్తి పేరున రికార్డులు మార్పించాల్సిన భాద్యతను కూడా అమ్మిన వ్యక్తులు తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తన వద్దనున్న కారుతో పాటు ఈ కారును కూడా తన పేరున నమోదు చేయించుకుంటే పన్ను అధికంగా కట్టాల్సి వస్తుందని.. వాటి ఎగవేతల కోసం వాహనాలు కొన్న వ్యక్తులు తమ పేరున కారును ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయరు.

అయితే కారు తమ పేరున ట్రాన్స్ ఫర చేయించుకుంటే తప్ప కారును విక్రయించమని తేగేసి చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం వాహనదారులకు సూచిస్తుది. ఇలా చేయని పక్షంలో మీ వాహనాన్ని కొన్న వ్యక్తి  కారును సొంతం చేసుకున్నప్పటికీ.. వారి చేతిలోనే లేక వారి బంధుమిత్రుల చేతుల్లో జరిగే ప్రమాదాలకు మాత్రం మీదే బాధ్యత అవుతుందని దేశ సర్వన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

బాధితులకు పరిహారం చెల్లింపుల విషయంలో కారు రికార్డుల పరంగా ఎవరు యజమానిగా వుంటే వారిదే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేపథ్యంతో వున్న ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఈ విషయాలను స్పష్టం చేసింది. విజయ్ కుమార్ అనే వ్యక్తి జూలై 12, 2007లో మరో వ్యక్తికి తన కారును విక్రయించాడు. సెప్టెంబరు 18, 2008లో ఆయన మరో వ్యక్తికి ఆ వాహనాన్ని అమ్మేశాడు. ఈ మూడో వ్యక్తి నవీన్ కుమార్‌కు కారును విక్రయించాడు.

ఆయన మీర్ సింగ్ అనే వ్యక్తికి దానిని విక్రయించినట్టు ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్‌’కు తెలిపాడు. మీర్ సింగ్ వద్ద ఉన్న కారును వేరే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ క్రమంలో మే 27, 2009లో కారు ప్రమాదానికి గురైంది. ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ట్రైబ్యునల్ బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.3.85 లక్షలు చెల్లించాల్సిందిగా రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా కారు యజమాని విజయ్‌కుమార్‌ను ఆదేశించింది.

ట్రైబ్యునల్ తీర్పును విజయ్ కుమార్ హరియాణా హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. కేసును విచారించిన త్రిసభ్య ధర్మాసనం కారు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న యజమానే అందుకు బాధ్యుడు అవుతాడని వ్యాఖ్యానించింది. ఓనర్‌షిప్ మార్చకుండా ఎన్నిసార్లు విక్రయించినా, ఎంతమంది నడిపినా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  vehicles  mvi act  records transfers  accidents  road mishap  delhi  

Other Articles